ప్రపంచకప్‌లో సెమీస్ పోరుకు సిద్ధమైంది. ఇలాంటి సమయంలో ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. 2008 లో అండర్-19 ప్రపంచకప్ సెమీస్‌లో తలపడ్డాయి భారత్- న్యూజిలాండ్. అప్పుడు టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీ, కివీస్‌కు విలియమ్సన్ సారథిగా ఉన్నాడు.
మళ్లీ ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మెగాటోర్నీలో అదే పోరుకు రంగం సిద్ధమైంది. అప్పుడు కివీస్‌పై మూడు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై నెగ్గి కప్పు కొట్టింది.
2008 అండర్-19 కెప్టెన్లుగా కోహ్లీ- విలియమ్సన్ ఆ రోజు జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకొని 205 పరుగులు చేసింది. అండర్‌సన్(70), విలియమ్సన్(37) రాణించి భారత్‌కు ఓ మోస్తరు లక్ష్యం నిర్దేశించారు. అనంతరం వర్షం కురిసి డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 43 ఓవర్లకు 191 పరుగుల లక్ష్యాన్ని సవరించారు. కోహ్లీ(43), ఎస్‌పీ గోస్వామి(51) నిలకడగా ఆడి జట్టును గెలిపించారు.
ప్రస్తుత ప్రపంచకప్‌లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియాకు నాలుగో స్థానంలో ఉన్న కివీస్‌కు మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ రెండింటిలో విజేతలుగా నిలిచిన జట్లు ఈ నెల 14న లార్డ్స్‌లో జరిగే ఫైనల్లో కప్పు కోసం పోటీ పడనున్నాయి.
ప్రపంచకప్‌లో కోహ్లీ-విలియమ్సన్ ఇది చదవండి: హెలికాప్టర్ షాట్ నేర్పిన మిత్రునికి ధోని ఏం చేశాడు?