తెలంగాణ

telangana

ETV Bharat / sports

ట్వీట్​ రేస్​లో విన్నర్ 'భారత్ - పాక్​ మ్యాచ్' - Twitter

ప్రపంచకప్​ జరుగుతుండగా ట్విట్టర్​ హోరెత్తింది. లక్షల్లో ట్వీట్లు పోటెత్తాయి. అయితే... ఫైనల్​ మ్యాచ్​ కంటే అత్యధికంగా భారత్​ - పాక్ మ్యాచ్​ కోసం 29 లక్షల పోస్ట్​లు చేశారు క్రికెట్ ప్రియులు. 2015 కంటే ఈ మెగాటోర్నీలో వంద శాతం అధికంగా ట్వీట్లు పోస్టయ్యాయి.

భారత్ - పాక్​ మ్యాచ్​కు ఎక్కవ ట్వీట్లు

By

Published : Jul 17, 2019, 11:48 AM IST

2019 వరల్డ్​కప్​లో సామాజిక మాధ్యమాలు అభిమానులకు వారధులుగా మారాయి. ​భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కు సంబంధించి 29 లక్షల ట్వీట్లు చేశారు అభిమానులు. అత్యధిక ట్వీట్లు అందుకున్న వన్డేగా రికార్డు సృష్టించిందీ మ్యాచ్​. తరువాత స్థానంలో ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్​ ఉండగా.. మూడో స్థానంలోని భారత్ - కివీస్ సెమీస్ మ్యాచ్​లో ఎక్కువ ట్వీట్లు నమోదయ్యాయని ట్విట్టర్ సంస్థ తెలిపింది.

మే 20 నుంచి జులై 15 వరకు 3 కోట్లుపైగా ట్వీట్లు చేశారని, 2015 తో పోల్చితే ఈ వరల్డ్ కప్ లో పోస్ట్​లు 100 శాతం పెరిగాయని తెలిపింది ట్విట్టర్​.

టీమిండియాపై, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై అత్యధిక ట్వీట్లు రావడం విశేషం. కెప్టెన్లలో విరాట్ కోహ్లీ(భారత్), సర్ఫరాజ్ అహ్మద్ (పాకిస్థాన్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్), అరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)పై విపరీతంగా ట్వీట్ లు వచ్చాయి.

87 ఏళ్ల టీమిండియా అభిమాని చారులత పటేల్​పై కోహ్లీ చేసిన ట్వీట్​కు 3.76 లక్షలకు పైగా లైక్‌లు, 43,000 కంటే ఎక్కువ రీ-ట్వీట్‌లు వచ్చాయి.

ఇది చదవండి: ప్రభాస్​ 'సాహో' విడుదల మరింత ఆలస్యం!

ABOUT THE AUTHOR

...view details