తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా బౌలింగ్​లో ఒక్క సిక్సూ కొట్టలేకపోయారు..! - ప్రపంచకప్​

ప్రపంచకప్​లో భారత బౌలర్ బుమ్రా సత్తాచాటుతున్నాడు. మూడు మ్యాచుల్లో కలిపి అతడు 168 బంతులేయగా.. ప్రత్యర్థి బ్యాట్స్​మెన్ ఒక్క సిక్సూ కొట్టలేదు.

బుమ్రా

By

Published : Jun 22, 2019, 1:11 PM IST

భారత స్టార్ పేసర్ జస్ప్రీత్​ బుమ్రా బౌలింగ్​లో రాకెట్ సైన్స్​ దాగుందంటూ ప్రపంచకప్​ టోర్నీకి ముందు సర్వత్రా చర్చ జరిగింది. ప్రస్తుతం అదే నిజమే అనిపిస్తోంది. ఈ మెగాటోర్నీలో భారత్​ ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి బుమ్రా మొత్తం 168 బంతులేయగా.. ఒక్క సిక్సర్​ కూడా కొట్టలేకపోయారు ప్రత్యర్థి బ్యాట్స్​మెన్.

బుమ్రా రాకెట్ సైన్స్

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్​లో 35 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు బుమ్రా. అనంతరం ఆసీస్​తో జరిగిన రెండో మ్యాచ్​లో 61 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్​తో జరిగాల్సిన మూడో మ్యాచ్​ వర్షం కారణంగా రద్దైంది. పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో వికెట్లేమి తీయలేదు.

వన్డే ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో ఉన్న బుమ్రా... బంతితో ప్రత్యర్థులను కట్టడి చేస్తూ.. ఆకట్టుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా, ఆసీస్​, పాకిస్థాన్​పై గెలిచిన భారత్ నేడు పసికూన అఫ్గాన్​తో తలపడుతోంది. సౌతాంప్టన్ వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది.

ఇది చదవండి: అఫ్గాన్​తో మ్యాచ్​కు రెడీ: విజయ్​ శంకర్​

ABOUT THE AUTHOR

...view details