తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్,రాహుల్ మెరుపులు.. బంగ్లా లక్ష్యం 315

బర్మింగ్​హామ్ వేదికగా జరిగిన మ్యాచ్​లో బంగ్లాదేశ్​కు 315 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్. రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ముస్తాఫిజుర్ 5 వికెట్లు తీశాడు.

రోహిత్,రాహుల్ మెరుపులు.. బంగ్లా లక్ష్యం 315

By

Published : Jul 2, 2019, 7:11 PM IST

ప్రపంచకప్​లో బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో​ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది టీమిండియా. బర్మింగ్​హామ్ వేదికగా జరిగిన ఈ పోరు​లో రోహిత్ శర్మ మరోసారి శతకంతో రెచ్చిపోగా.. రాహుల్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ ఐదు వికెట్లు.. రుబెల్, సౌమ్య సర్కార్, షకీబ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​ శుభారంభం దక్కింది. రోహిత్ - రాహుల్ జోడి తొలి వికెట్​కు 180 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రపంచకప్​లో భారత ఓపెనర్లకు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. రోహిత్ శర్మను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు సౌమ్యా సర్కార్. తర్వాత కాసేపటికే లోకేశ్ రాహుల్​ను పెవిలియన్ చేర్చాడు రుబెల్.

శతకంతో కదం తొక్కిన రోహిత్ ..

ఈ ప్రపంచకప్​లో వరుస శతకాలతో దూసుకెళ్తున్న రోహిత్ శర్మ.. ఈ రోజు మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. 90 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచకప్​లో నాలుగు శతకాలు నమోదు చేశాడు. 2003 గంగూలీ చేసిన మూడు సెంచరీల రికార్డును రోహిత్ అధిగమించాడు.

సెంచరీతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ

మిగతా వారిలో 48 పరుగులు చేసిన పంత్ కొద్దిలో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు. ధోని 35, కోహ్లీ 26 చేశారు. పాండ్య, షమి డకౌట్, దినేశ్ కార్తీక్ 8, భువనేశ్వర్ 2 పరుగులు చేశారు.

బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 5 వికెట్లు తీసి పరుగులు నియంత్రించడంలో కీలక పాత్ర పోషించాడు. షకీబ్, రుబెల్, సౌమ్య సర్కార్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details