తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫెర్నాండో అద్భుత శతకం.. వెస్టిండీస్ లక్ష్యం 339 - వెస్టిండీస్

వెస్టిండీస్​తో మ్యాచ్​లో 338 పరుగులు చేసిన లంక.. ప్రత్యర్థికి భారీ లక్ష్యం నిర్దేశించింది. ఫెర్నాండో సెంచరీతో రాణించాడు.

ఫెర్నాండో అద్భుత శతకం.. వెస్టిండీస్ లక్ష్యం 339

By

Published : Jul 1, 2019, 7:15 PM IST

చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో ముందుగా బ్యాటింగ్ చేసిన లంక... నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. మూడో స్థానంలో దిగిన ఫెర్నాండో అద్భుతంగా ఆడి 104 పరుగులు చేశాడు.

టాస్ ఓడిన శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగించింది వెస్టిండీస్. ఓపెనర్లు కరుణరత్నే-కుశాల్ పెరీరా జోడీ తొలి వికెట్​కు 93 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. ఆ తర్వాత వెంట వెంటనే వారిద్దరూ ఔటయ్యారు. కరుణరత్నే 32, పెరీరా 64 పరుగులు చేశారు. మిగతావారిలో కుశాల్ మెండిస్ 39, మాథ్యూస్ 26, తిరుమన్నె 45 పరుగులు చేశారు.

వెస్టిండీస్ బౌలర్లలో హోల్డర్ 2 వికెట్లు తీశాడు. కాట్రెల్, థామస్, అలెన్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ఇది చదవండి: ఇంగ్లాండ్​లోనూ భారత్ అభిమానులదే హవా

ABOUT THE AUTHOR

...view details