తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: సోహైల్ ఖాతాలో అరుదైన రికార్డు - imran

ప్రపంచకప్ మ్యాచ్​లో అత్యధిక స్ట్రైక్ రేట్ నమోదు చేసిన మూడో పాక్ ఆటగాడిగా ఘనత అందుకున్నాడు హారిస్ సోహైల్. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో 150.85 స్ట్రైక్ రేట్​తో అతడు 89 పరుగులు చేశాడు.

సొహైల్

By

Published : Jun 24, 2019, 8:28 AM IST

దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్​లో పాక్ ఆటగాడు హారిస్​ సోహైల్ అరుదైన రికార్డు సాధించాడు. వరల్డ్​కప్​ మ్యాచ్​లో అత్యధిక స్ట్రైక్ రేట్ నమోదు చేసిన మూడో పాక్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 59 బంతుల్లో 89 పరుగులు చేసిన సోహైల్ 150.85 స్ట్రైక్​ రేట్​తో ఆడాడు. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

అంతకుముందు పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ 1983 ప్రపంచకప్​లో శ్రీలంకపై 169.69 స్ట్రైక్​ రేట్​తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ మ్యాచ్​లో 33 బంతుల్లో 56 పరుగుల చేశాడు ఇమ్రాన్. ఆ తర్వాత ఇంజిమామ్ ఉల్ హఖ్​ 1992 మెగాటోర్నీలో 37 బంతుల్లో 60 పరుగుల చేసి రెండో స్థానంలో ఉన్నాడు. 162.16 స్ట్రైక్ రేట్ నమెదు చేశాడు ఇంజిమామ్.

జెర్సీ నెంబర్​.. పరుగులు ఒక్కటే..

సఫారీలతో జరిగిన ఈ మ్యాచులో మరో ఘనత సాధించాడు సోహైల్. అతడి జెర్సీ నెంబర్​(89).. చేసిన పరుగులు(89) ఒక్కటే కావడం విశేషం.

లార్డ్స్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో దక్షిణాఫ్రికాపై 49 పరుగుల తేడాతో విజయం సాధించింది పాకిస్థాన్. 309 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన ప్రొటీస్ 259 పరుగులకే పరిమితమైంది. హారిస్​ సొహైల్, బాబార్ ఆజమ్(69) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.

ఇది చదవండి: సఫారీలపై పాక్​ జయకేతనం- సెమీస్​ ఆశలు సజీవం

ABOUT THE AUTHOR

...view details