తెలంగాణ

telangana

ETV Bharat / sports

కివీస్​తో మ్యాచ్​లో ధావన్​ ఆడతాడా..! - world cup

ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో ధావన్ చేతి వేలికి గాయమైంది. మంగళవారం అతడికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ధావన్

By

Published : Jun 11, 2019, 8:30 AM IST

ఆస్ట్రేలియాపై అద్భుత శతకం చేసి ఫామ్​లోకి వచ్చిన టీమిండియా ఓపెనర్ ధావన్ వేలికి గాయమైంది. కౌల్టర్​నైల్ విసిరిన బంతి శిఖర్ చేతికి బలంగా తాకింది. అయితే ఈ గాయానికి మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ముందు స్కానింగ్ చేయించనున్నారు.

గాయం వల్ల ధావన్ ఆసీస్​తో మ్యాచ్​లో ఫీల్డింగ్​కు రాలేదు. అతడి స్థానంలో జడేజా ఫీల్డింగ్ చేశాడు. స్కానింగ్​లో తేలే విషయాన్ని బట్టి గురువారం న్యూజిలాండ్​తో జరిగే మ్యాచ్​కు గబ్బర్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది తెలుస్తుంది. ధావన్​కు ఎలాంటి గాయం కాకూడదని జట్టుతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు.

ఇవీ చూడండి.. యువీ హార్ట్​ టచింగ్ వీడియో!

ABOUT THE AUTHOR

...view details