తెలంగాణ

telangana

'ప్రపంచ క్రికెట్​లో అతిపెద్ద మ్యాచ్ ఇదే​'​

By

Published : Jun 16, 2019, 8:52 PM IST

మాంచెస్టర్​ వేదికగా భారత్​-పాక్​ మ్యాచ్​ను ప్రత్యక్షంగా వీక్షిస్తూ సందడి చేశారు బాలీవుడ్​ హీరో సైఫ్​ అలీఖాన్​. నటి శిబానీ దండేకర్​తో కలిసి మ్యాచ్​ చూసిన ఆయన టీమిండియాను ప్రోత్సహించేందుకు ఇంగ్లాండ్​కు వెళ్లారు.

'ప్రపంచ క్రికెట్​లో అతిపెద్ద మ్యాచ్ ఇదే​'

క్రికెట్​... ఎన్నో టోర్నీలు.. మరెన్నో సిరీస్​లు.. కానీ ప్రపంచకప్​ ప్రత్యేకం. అలానే ఎన్నో మ్యాచ్​లు... మరెందరో ఆటగాళ్లు... కానీ భారత్​-పాక్​ ఆట మాత్రం విభిన్నం. అందుకే అంతర్జాతీయ క్రికెట్​లోనే ఇది అతిపెద్ద సంగ్రామంగా పేర్కొన్నారు బాలీవుడ్​ హీరో సైఫ్​ అలీఖాన్​.

టీమిండియా-పాకిస్థాన్​ మధ్య పోరు చాలా రసవత్తరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు సైఫ్​. నటి శిబానీ దండేకర్​తో కలిసి భారత జెండాలతో టీమిండియాకు మద్దతిచ్చారు. తొలుత బ్యాటింగ్​ చేసిన భారత జట్టు 50 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. రోహిత్​ అద్భుతమైన శతకంతో రాణించగా... రాహుల్​, కోహ్లీ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details