తెలంగాణ

telangana

ETV Bharat / sports

గాయంతోనే కసరత్తులు చేస్తోన్న ధావన్ - cricket

గాయం కారణంగా మూడు మ్యాచ్​లకు దూరమైన శిఖర్ ధావన్ జిమ్​లో కసరత్తులు చేస్తున్నాడు. గాయం నుంచి కోలుకోవడానికి శ్రమిస్తున్నాడు.

ధావన్

By

Published : Jun 15, 2019, 9:03 AM IST

ప్రపంచకప్​లో బొటనవేలి గాయం కారణంగా కనీసం 3 మ్యాచ్​లకు భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమైన సంగతి తెలిసిందే. త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు జట్టు కూడా భావిస్తోంది. శిఖర్ కూడా గాయం బారి నుంచి తొందరగా బయటపడటానికి జిమ్​లో కసరత్తులు చేస్తున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో శతకం చేసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు ధావన్. ఆదివారం పాకిస్థాన్, 22వ తేదీన అఫ్గానిస్థాన్​తో జరిగే మ్యాచ్​లకు శిఖర్ అందుబాటులో ఉండడు. మిగిలిన మ్యాచ్​ల్లో ఆడేది లేనిది వచ్చే వారం తెలియనుంది. ప్రస్తుతం అతడి ఆరోగ్యాన్ని బీసీసీఐ పర్యవేక్షిస్తోంది.

ఇవీ చూడండి.. విధ్వంసక క్రికెటర్ గేల్ సరికొత్త రికార్డు

ABOUT THE AUTHOR

...view details