ఈ ప్రపంచకప్‌లో రెండో సారి వరణుడు మ్యాచ్ జరగకుండా అడ్డుకున్నాడు. సౌతాంప్టన్ వేదికగా వెస్టిండీస్ - దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ ఫలితం తేలని కారణంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
చాలాసేపు కురిసిన వర్షం మధ్యలో ఆగినా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటం వల్ల మ్యాచ్ నిర్వహించేందుకు వీలు పడలేదు. పదే పదే జల్లులు పడటం.. పిచ్‌ను కవర్లతో కప్పేయడం ఇదే తంతుగా సాగింది. అంపైర్లు మధ్యలో చాలాసార్లు పిచ్‌ను పరిశీలించారు. అయినా మైదానం సహకరించనందున మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది.