తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రోహిత్ లాంటి బ్యాట్స్​మనే అక్కడ ఆడగలడు' - worldcup

పిచ్​కు తగినట్టు బ్యాటింగ్ శైలిని మార్చుకుంటే స్థిరంగా రాణించవచ్చని టీమిండియా ఓపెనర్ కే ఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడని తెలిపాడు.

రాహుల్

By

Published : Jul 4, 2019, 6:10 PM IST

ఇంగ్లాండ్​ పరిస్థితులకు అలవాటు పడితేనే స్థిరంగా రాణించగలమని టీమిండియా ఓపెనర్ కే ఎల్ రాహుల్ అన్నాడు. ప్రపంచకప్​లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని, ఇంగ్లీష్ పిచ్​ల్లో రోహిత్ లాంటి ఆటగాడే అలాంటి ప్రదర్శన చేస్తాడని అభిప్రాయపడ్డాడు.

"గత రెండేళ్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. వికెట్​కు తగినట్టుగా, పిచ్ పరిస్థితులకు అలవాటు పడితేనే స్థిరంగా రాణించగలం. గత కొన్ని మ్యాచ్​ల్లో పిచ్ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఉన్నట్టుండి వికెట్ స్లోగా మారుతోంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని పరుగులు చేయడానికి అలవాటు పడాలి" - కే ఎల్ రాహుల్, టీమిండియా ఓపెనర్

ఈ ప్రపంచకప్​లో వరుసగా నాలుగు శతకాలతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు రాహుల్. ఇంగ్లాండ్ పిచ్​ల్లో అతడిలా(రోహిత్​) ఆడాలంటే మళ్లీ హిట్ మ్యాన్ లాంటి బ్యాట్స్​మెన్​కే కుదురుతుందని అభిప్రాయపడ్డాడు.

మెగాటోర్నీ ప్రారంభంలో నాలుగో స్థానంలో ఆడిన రాహుల్.. ధావన్ గాయం కారణంగా తప్పుకోగా అతడి స్థానంలో ఓపెనర్​గా వస్తున్నాడు. ఈ టోర్నీలో రెండు అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడీ బ్యాట్స్​మెన్. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో రోహిత్​తో కలిసి 180 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఇది చదవండి: 'రాయుడు... నువ్వు ఉన్నతమైన వ్యక్తివి'

ABOUT THE AUTHOR

...view details