ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగించింది. ఈ కారణంగా ఇంగ్లాండ్ బ్రిస్టల్లో జరగాల్సిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు రద్దయ్యాయి. వెస్టిండీస్ - దక్షిణాఫ్రికా మధ్య వార్మప్ మ్యాచ్ 12.4 ఓవర్లు వరకు సాగగా.. బంగ్లాదేశ్ - పాకిస్థాన్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడలేదు.
ప్రాక్టీస్ మ్యాచ్లకు అడ్డుతగిలిన వరుణుడు - rain
ఆదివారం జరగాల్సిన ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. వెస్టిండీస్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ 12.4 ఓవర్ల జరగగా.. బంగ్లాదేశ్ - పాకిస్థాన్ మ్యాచ్లో ఒక్క బంతి కూడా పడలేదు.
ప్రాక్టీస్
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఆమ్లా(51) అర్ధశతకంతో అదరగొట్టగా.. మరో ఓపెనర్ డికాక్ 30 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ ధాటిగా ఆడుతూ ప్రత్యర్థులకు దడ పుట్టించారు. 12.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా వికెట్ కోల్పోకుండా 95 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మైదానాన్ని ముంచెత్తింది. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారి.. ఆటకు సహకరించలేదు.