తెలంగాణ

telangana

ETV Bharat / sports

అమ్మ చెప్పింది... పాక్​ బౌలర్ భావోద్వేగం!

భారత్‌తో మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేయాలని తన తల్లి నసీం అక్తర్‌ కోరుకునేదని పాకిస్థాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ గుర్తుచేసుకున్నాడు. గత మార్చిలో తల్లిని కోల్పోయిన పాక్‌ బౌలర్‌ టీమిండియాతో మ్యాచ్‌కు ముందు ఆమె మాటలను గుర్తు చేసుకున్నాడు.

మ్యాచ్​కు ముందు పాక్​ బౌలర్​ ఆసక్తికర వ్యాఖ్యలు

By

Published : Jun 16, 2019, 1:06 PM IST

టీమిండియాతో జరిగే మ్యాచ్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పాక్ బౌలర్ మహ్మద్​ ఆమిర్​. ఈ మ్యాచ్​లో మంచి ప్రదర్శన చేసి ఐదు వికెట్లు పడగొట్టడమే తన తల్లి నసీం అక్తర్​ కోరికని తెలిపాడు. గత మార్చిలో తల్లిని కోల్పోయిన పాక్‌ బౌలర్‌ టీమిండియాతో మ్యాచ్‌కు ముందు ఆమె మాటలను గుర్తు చేసుకున్నాడు.

"నేను బాగా ఆడాలని స్వర్గం నుంచి నా తల్లి తప్పకుండా ప్రార్థిస్తుంది. మ్యాచ్‌ జరిగేటప్పుడు ప్రతిసారి ఆమె టీవీ ముందు కూర్చొని నేను బాగా ఆడాలని కోరుకునేది. ఇక నేను ఐదు వికెట్లు తీయడమే మా అమ్మ పెద్ద కోరిక. అలా నేను ఆడిన ప్రతి మ్యాచ్​లోనూ ఐదు వికెట్లు తీయాలని కోరుకునేది. ఆస్ట్రేలియాపై ఐదు వికెట్లు తీసిన వెంటనే కన్నీళ్లొచ్చాయి. ఆ సమయంలో మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి" అని ఆమిర్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.

"జట్టుకు అవసరమైనప్పుడు వికెట్లు తీస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నేను బౌలింగ్ సరిగా చేసినా చేయకపోయినా... వికెట్లు తీసినా, తీయకపోయినా నా కెప్టెన్​, కోచ్​, బౌలింగ్ కోచ్​తో పాటు సహచర ఆటగాళ్లందరూ నాకు అండగా నిలిచారు. "
-మహ్మద్​ ఆమిర్​, పాక్ పేసర్​

పాక్​ ప్రపంచకప్‌ జట్టులో ఆఖరి నిమిషంలో చోటు సంపాదించుకున్న ఆమిర్‌ తన ఎంపిక సరైనదేనని ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో నిరూపించుకున్నాడు. ఐదు వికెట్లతో కంగారూలపై విరుచుకుపడి ఈ మెగాటోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదీ చూడండి : భారత్​ X పాక్ మ్యాచ్​కు ​గేల్​ ప్రత్యేక డ్రస్

ABOUT THE AUTHOR

...view details