తెలంగాణ

telangana

ETV Bharat / sports

నీషమ్, గ్రాండ్​హోమ్ పోరాటం.. పాక్ లక్ష్యం 238 - న్యూజిలాండ్

ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరుగుతోన్న మ్యాచ్​లో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. నీషమ్ (97), గ్రాండ్​హోమ్ (64) అర్ధశతకాలతో మెరిశారు.

నీషమ్, గ్రాండ్​హోమ్ పోరాటం.. పాక్ లక్ష్యం 238

By

Published : Jun 26, 2019, 8:18 PM IST

పాకిస్థాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో న్యూజిలాండ్ టాప్ ఆర్డర్​ విఫలమైంది. పాకిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్​తో ఆకట్టుకున్నారు. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్​లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు సాధించింది.

ప్రారంభం నుంచి పాకిస్థాన్ బౌలర్లు కివీస్ బ్యాట్స్​మెన్​పై ఆధిపత్యం ప్రదర్శించారు. వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను కట్టడి చేశారు. షహీన్ అఫ్రిదీ, మహ్మద్ ఆమిర్ ధాటికి మొదటి 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది కివీస్. గప్తిల్ (5), మున్రో (12), టేలర్ (3), లాథమ్ (1) విఫలమయ్యారు.

కివీస్ సారథి విలియమ్సన్, మిడిలార్డర్ బ్యాట్స్​మెన్ నీషమ్ కాసేపు జాగ్రత్తగా ఆడారు. ఐదో వికెట్​కు 37 పరుగులు జోడించిన అనంతరం విలియమ్స్​న్ (41)ను షాదాబ్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి మరోసారి కష్టాల్లో పడింది కివీస్. 30 ఓవర్లకు 94 పరుగులు చేసింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

శతక భాగస్వామ్యం

నీషమ్​, గ్రాండ్​హోమ్ పరిస్థితిని అర్థం చేసుకుని ఆడుతూ పరుగులు సాధించారు. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అర్ధసెంచరీలు చేశారు. ఆరో వికెట్​కు 132 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది నీషమ్-గ్రాండ్​హోమ్ జోడి. అనంతరం 48 ఓవర్లో అనవసర పరుగుకు యత్నించి గ్రాండ్​హోమ్ (64) రనౌట్​గా వెనుదిరిగాడు. నీషమ్ 97 పరుగులతో అజేయం​గా నిలిచాడు.

పాకిస్థాన్ బౌలర్లలో షహీన్ అఫ్రిదీ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. మహ్మద్ ఆమిర్, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఇవీ చూడండి.. క్రిస్​ గేల్ వీడ్కోలు పలికేది అప్పుడే..!

ABOUT THE AUTHOR

...view details