పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను పరుషపదజాలంతో దూషించాడు ఓ వ్యక్తి. తన కొడుకుతో కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లిన పాక్ సారిథిని.. అభిమానినంటూ ఓ వ్యక్తి వెంబడించాడు. ఫోటో కోసం ప్రయత్నించిన ఆ వ్యక్తి.. పాక్ కెప్టెన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.
పాక్ కెప్టెన్‌ను అవమానించిన అభిమాని! - fan
పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు చేదు అనుభవం ఎదురైంది. భారత్‌తో మ్యాచ్‌లో పాక్ ఓటమికి సర్ఫ్‌రాజ్‌ను బాధ్యుడిని చేస్తూ ఓ వ్యక్తి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
సర్ఫరాజ్
భారత్‌తో మ్యాచ్‌లో పాక్ ఓటమికి బాధ్యుడిని చేస్తూ దూషించాడు. అంతే కాదు ఈ తతంగాన్ని సెల్ఫీ వీడియో రూపంలో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ అంశంపై స్పందించిన అభిమానులు పాక్ సారథికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.