తెలంగాణ

telangana

ETV Bharat / sports

అఫ్గాన్​పై 62 పరుగుల తేడాతో బంగ్లాదేశ్​ విజయం

By

Published : Jun 24, 2019, 2:22 PM IST

Updated : Jun 24, 2019, 10:53 PM IST

ప్రపంచకప్​ పోరు: బంగ్లాకు అఫ్గాన్​ సవాల్

2019-06-24 22:46:01

షకిబ్​ మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​...

263 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 200 రన్స్​కే ఆలౌట్​ అయింది అఫ్గాన్​ జట్టు. షిన్వారీ(51 బంతుల్లో 41 పరుగులతో) ఒంటరి పోరాటం  చేసి చివరి వరకు నాటౌట్​గా నిలిచాడు. బంగ్లాదేశ్​ బౌలర్లలో షకిబ్​ 5 వికెట్లు తీసి అఫ్గాన్​ పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో 7 పాయింట్లతో అయిదో స్థానంలో ఉంది. సెమీస్​ బరిలో మరింత మెరుగ్గా తయారయింది. అయిదు వికెట్లు సహా అర్ధశతకం సాధించిన షకిబ్​ మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ గెలుచుకున్నాడు.

2019-06-24 22:45:57

36 ఓవర్లకు అఫ్గాన్​ స్కోరు- 141/6

34వ ఓవర్​ వేసిన మోర్తజా​... 6 పరుగులు ఇచ్చుకున్నాడు. 35వ ఓవర్​ వేసిన ముస్తాఫిజుర్​​...7  పరుగలు ఇచ్చాడు. 35వ ఓవర్​ వేసిన ముస్తాఫిజుర్​​...7  పరుగులు ఇచ్చాడు. 36వ ఓవర్​ వేసిన మోహిదీ వికెట్​ తీశాడు. బ్యాట్స్​మెన్ల మధ్య సమన్వయ లోపంతో ఆరో వికెట్​ కోల్పోయింది అఫ్గాన్​ జట్టు. ఇక్రమ్​ 12 బంతుల్లో 11 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు.

క్రీజులో షిన్వారీ 21 బంతుల్లో 13 పరుగులు, నజీబుల్లా 2 బంతుల్లో 4 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.

2019-06-24 22:45:52

ముచ్చటగా నాలుగోది..

33వ ఓవర్​ వేసిన షకిబ్​... రెండు పరుగులు మాత్రమే ఇచ్చి అస్గార్‌ వికెట్​ తీశాడు. 38 బంతుల్లో 20 పరుగులతో నెమ్మదిగా ఆడుతున్న అస్గార్​ క్యాచ్​ ఔట్​గా పెవిలియన్​ చేరాడు. ఇక్రామ్‌ క్రీజులోకి అడుగుపెట్టాడు.

33 ఓవర్లకు అఫ్గాన్​ స్కోరు- 119/5

2019-06-24 22:44:39

షకిబ్​ సత్తా...

ఒకే ఓవర్​లో రెండు కీలక వికెట్లు తీసి అఫ్గాన్​ జట్టును ఒత్తిడిలో పడేశాడు షకిబ్​. గుల్బాదిన్​ను ఔట్​ చేసిన రెండో బంతికే నబీని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు షకిబ్​. రెండు బంతులాడిన నబీ పరుగులేమి చేయకుండానే డకౌట్​గా పెవిలియన్​ చేరాడు. అస్గార్‌ అఫ్గాన్‌ 28 బంతుల్లో 13 పరుగులు చేసి నాటౌట్​గా ఉన్నాడు. సమీవుల్లా షిన్వారీ క్రీజులోకి వచ్చాడు.

29 ఓవర్లకు అఫ్గాన్​ స్కోరు- 106/4

2019-06-24 21:40:59

సారథి అర్ధశతకం మిస్​...

75 బంతుల్లో 47 పరుగులు చేసిన గుల్బాదిన్​ తృటిలో అర్ధశతకం మిస్​ అయ్యాడు. 28వ ఓవర్​ తొలి బంతికి గుల్బాదిన్​ను పెవిలియన్​ చేర్చాడు షకిబ్​. లిటన్​దాస్​కు క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు అఫ్గాన్​ సారథి.

2019-06-24 21:28:50

అర్ధశతకానికి చేరువలో గుల్బాదిన్​...

26వ ఓవర్​ వేసిన సైఫుద్ధీన్​ 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఓపెనర్​ గుల్బాదిన్​ 72 బంతుల్లో 45 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో ఎండ్​లో అస్గార్‌ అఫ్గాన్‌ 18 బంతుల్లో 12 పరుగులు చేశాడు.

26 ఓవర్లకు అఫ్గాన్​ స్కోరు- 101/2

2019-06-24 21:28:44

వన్డేల్లో వేయి పరుగులు...

మెహిదీ వేసిన 23వ ఓవర్​ మూడో బంతికి సింగిల్​ తీసిన గుల్బాదిన్​ వన్డే కెరీర్​లో వేయి పరుగుల మైలురాయి చేరుకున్నాడు. 25వ ఓవర్లకు గుల్బాదిన్​ 70 బంతుల్లో 44 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో ఎండ్​లో అస్గార్‌ అఫ్గాన్‌ 14 బంతుల్లో 10 పరుగులు చేశాడు.

25 ఓవర్లకు అఫ్గాన్​ స్కోరు- 98/2

2019-06-24 21:11:22

21 ఓవర్లకు అఫ్గాన్​ స్కోరు- 79/2

17వ ఓవర్​లో మొసదీక్‌ హసన్‌ 5 పరుగులు, 18వ ఓవర్​లో మెహిదీ హసన్‌ 7 పరుగులు, 19వ ఓవర్​లో మొసదీక్‌ హసన్‌ 1 పరుగు, 20వ ఓవర్​లో మెహిదీ హసన్‌ 4 పరుగులు వచ్చాయి.

21వ ఓవర్​ వేసిన మొసదీక్‌ కీలక వికెట్​ సాధించాడు. నెమ్మదిగా సాగుతున్న అఫ్గాన్​ ఇన్నింగ్స్​కు చెక్​ పెట్టాడు ఫలితంగా హస్మతుల్లా 31 బంతులు ఆడి 11 పరుగులు చేసి ఔటయ్యాడు. సారథి, ఓపెనర్​ గుల్బాదిన్​ 59 బంతుల్లో 35 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో ఎండ్​లో అస్గార్‌ అఫ్గాన్‌ క్రీజులోకి వచ్చాడు.

2019-06-24 21:07:53

15 ఓవర్లకు అఫ్గాన్​ స్కోరు- 58/1

14వ ఓవర్​ వేసిన మెహిదీ హసన్‌​​ 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 15వ ఓవర్​లో మొసదీక్‌ హసన్‌​ నాలుగు పరుగులు ఇచ్చాడు.  ఓపెనర్​ గుల్బాదిన్​ 45 బంతుల్లో 24 పరుగులతో క్రీజులో ఉన్నాడు. హస్మతుల్లా 10 బంతులు ఆడి ఒక్క పరుగు మాత్రమే చేశాడు.

2019-06-24 20:59:05

16 ఓవర్లకు అఫ్గాన్​ స్కోరు- 60/1

16వ ఓవర్​ వేసిన మెహిదీ హసన్‌ పరుగులు బాగా నియంత్రించాడు. ఈ ఓవర్​లో రెండు రన్స్​ మాత్రమే ఇచ్చాడు. ఓపెనర్​ గుల్బాదిన్​ 47 బంతుల్లో 25 పరుగులతో క్రీజులో ఉన్నాడు. హస్మతుల్లా 14 బంతులు ఆడి 2 పరుగులు చేశాడు.

2019-06-24 20:54:36

13 ఓవర్లకు అఫ్గాన్​ స్కోరు- 51/1

12వ ఓవర్​ వేసిన మెహిదీ హసన్‌​​ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. 13వ ఓవర్​లో షకీబ్​ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు.  ఓపెనర్​ గుల్బాదిన్​ 35 బంతుల్లో 18 పరుగులతో క్రీజులో ఉన్నాడు. హస్మతుల్లా 8 బంతులు ఆడి ఒక్క పరుగు చేయలేదు.

2019-06-24 20:53:50

11 ఓవర్లకు అఫ్గాన్​ స్కోరు- 49/1

10వ ఓవర్​ వేసిన సైఫుద్ధీన్​ 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 11వ ఓవర్​లో షకీబ్​ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి కీలక వికెట్​ తీశాడు. షాట్​ కొట్టే ప్రయత్నంలో తమీమ్​కు  క్యాచ్​ ఇచ్చాడు ఓపెనర్​ రహ్మత్​. 35 బంతుల్లో 24 పరుగులతో మంచి ఓపెనింగ్​ అందించాడు రహ్మత్​. మరో ఓపెనర్​ గుల్బాదిన్​ 30 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. హస్మతుల్లా క్రీజులోకి వచ్చాడు.

2019-06-24 20:39:28

2019-06-24 20:24:30

11 ఓవర్లకు అఫ్గాన్​ స్కోరు- 49/1

10వ ఓవర్​ వేసిన సైఫుద్ధీన్​ 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 11వ ఓవర్​లో షకీబ్​ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి కీలక వికెట్​ తీశాడు. షాట్​ కొట్టే ప్రయత్నంలో తమీమ్​కు  క్యాచ్​ ఇచ్చాడు ఓపెనర్​ రహ్మత్​. 35 బంతుల్లో 24 పరుగులతో మంచి ఓపెనింగ్​ అందించాడు రహ్మత్​. మరో ఓపెనర్​ గుల్బాదిన్​ 30 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. హస్మతుల్లా క్రీజులోకి వచ్చాడు.

2019-06-24 20:15:48

7 ఓవర్లకు అఫ్గాన్​ స్కోరు- 31 పరుగులు ( వికెట్​ నష్టపోకుండా)

6వ ఓవర్​ వేసిన ముస్తాఫిజుర్​ ఒక ఫోర్​తో కలిపి ఆరు పరుగులు సమర్పించుకొన్నాడు. 7వ ఓవర్​ వేసిన మోర్తజా 4 పరుగులు ఇచ్చాడు.

అఫ్గాన్​ బ్యాట్స్​మెన్ గుల్బాదిన్​ ( 18 బంతుల్లో 8 పరుగులు), రహ్మత్​ ( 24 బంతుల్లో 14 పరుగులు) చేసి నాటౌట్​గా కొనసాగుతున్నారు.

2019-06-24 20:13:12

భారీ లక్ష్య ఛేదన...

263 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది అఫ్గాన్​ జట్టు. ఓపెనర్లుగా గుల్బాదిన్​, రహ్మత్​ క్రీజులోకి అడుగుపెట్టారు. మోర్తజా వేసిన 2వ ఓవర్​ తొలి బంతికే రనౌట్​ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు రహ్మత్​​.

3 ఓవర్లకు అఫ్గాన్​ స్కోరు- 15 పరుగులు (వికెట్​ నష్టపోకుండా)

2019-06-24 20:08:30

నెమ్మదిగా ఆడుతున్న ఓపెనర్లు...

అఫ్గాన్​ బ్యాట్స్​మెన్ గుల్బాదిన్​ ( 14 బంతుల్లో 3 పరుగులు), రహ్మత్​ ( 16 బంతుల్లో 9 పరుగులు) చేసి నాటౌట్​గా కొనసాగుతున్నారు.

4వ ఓవర్​ వేసిన ముస్తాఫిజుర్​ 5 పరుగులు ఇచ్చుకున్నాడు. 5వ ఓవర్​లో మోర్తజా​ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు.

5 ఓవర్లకు అఫ్గానిస్థాన్​ స్కోరు- 21 (వికెట్​ నష్టపోకుండా)

2019-06-24 19:59:21

భారీ లక్ష్య ఛేదన...

263 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది అఫ్గాన్​ జట్టు. ఓపెనర్లుగా గుల్బాదిన్​, రహ్మత్​ క్రీజులోకి అడుగుపెట్టారు. మోర్తజా వేసిన 2వ ఓవర్​ తొలి బంతికే రనౌట్​ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు రహ్మత్​​.

3 ఓవర్లకు అఫ్గాన్​ స్కోరు- 15 పరుగులు (వికెట్​ నష్టపోకుండా)

2019-06-24 19:55:15

ముష్ఫికర్ ఔట్...

ముష్ఫికర్ రహీమ్​ (83) పరుగులు చేసి వెనుదిరిగాడు. ధావ్లత్​ బౌలింగ్​లో భారీ షాట్​కు యత్నించి నబీకి క్యాచ్​ ఇచ్చాడు. ప్రస్తుతం బంగ్లా 49 ఓవర్లకు 254 పరుగులు చేసింది. మరో ఓవర్ మిగిలి ఉంది.

2019-06-24 19:42:54

బంగ్లాదేశ్ 262/7...

అఫ్గాన్​తో మ్యాచ్​లో బంగ్లాదేశ్​ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ముష్ఫికర్​ (83), షకిబుల్ (51) పరుగులతో సత్తా చాటారు. అఫ్గాన్​ బౌలర్లలో రహ్మాన్​ 3, నయీబ్​ 2 వికెట్లతో రాణించారు. 

2019-06-24 19:35:41

ముష్ఫికర్ ఔట్...

ముష్ఫికర్ రహీమ్​ (83) పరుగులు చేసి వెనుదిరిగాడు. ధావ్లత్​ బౌలింగ్​లో భారీ షాట్​కు యత్నించి నబీకి క్యాచ్​ ఇచ్చాడు. ప్రస్తుతం బంగ్లా 49 ఓవర్లకు 254 పరుగులు చేసింది. మరో ఓవర్ మిగిలి ఉంది.

2019-06-24 19:27:14

చివరి 3 ఓవర్లు...

బంగ్లా ఇన్నింగ్స్​లో చివరి 3 ఓవర్లు మిగిలాయి . ప్రస్తుతం బంగ్లా స్కోరు 236/5. 

2019-06-24 18:51:17

45 ఓవర్లకు 220 పరుగులు...

45 ఓవర్లకు బంగ్లాదేశ్​ 220 పరుగులు చేసింది. మరో 5 ఓవర్లు ఉన్నాయి. ముష్ఫికర్ (75*) పరుగులతో క్రీజులో ఉన్నాడు.

2019-06-24 18:42:47

మహ్మదుల్లా ఔట్...

స్కోరు పెంచే వేగంలో బంగ్లాదేశ్​ మరో వికెట్​ కోల్పోయింది. మహ్మదుల్లా (27) నయీబ్​ బౌలింగ్​లో క్యాచ్​గా వెనుదిరిగాడు.

2019-06-24 18:37:15

200 మార్కు...

బంగ్లాదేశ్​ 200 మార్కును అందుకుంది. ముష్ఫికర్​, మహ్మదుల్లా ఐదో వికెట్​కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

2019-06-24 18:26:39

40 ఓవర్లకు 193 పరుగులు...

బంగ్లా బ్యాటింగ్​ జోరు పెంచింది. 40 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 193 పరుగులతో ఉంది. ముష్ఫికర్ (62*), మహ్మదుల్లా (17*) క్రీజులో ఉన్నారు.

2019-06-24 18:17:24

అర్ధ శతకం చేసిన రహీమ్​...

బంగ్లాదేశ్​ ముష్ఫికర్​ రహీమ్​  (51*) మరోసారి విలువైన ఇన్నింగ్స్​ ఆడాడు. ఓ భారీ సిక్సర్​తో కెరీర్​లో మరో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.

2019-06-24 18:10:54

36 ఓవర్లకు 163 పరుగులతో బంగ్లా...

బంగ్లాదేశ్​ స్కోరు వేగం నెమ్మదించింది. అఫ్గాన్​ స్నిన్నర్లు కట్టిదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. 36 ఓవర్లు గడిచేసరికి బంగ్లా 163 పరుగులతో ఉంది.

2019-06-24 18:01:33

33 ఓవర్లకు 153 వద్ద బంగ్లా...

అఫ్గానిస్థాన్​ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. కీలక సమయాల్లో బంగ్లా వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో ముష్ఫికర్​ (39*), మహ్మదుల్లా (1*) ఉన్నారు. బంగ్లా 33 ఓవర్లకు 153 వద్ద ఆడుతోంది.

2019-06-24 17:51:32

 సర్కార్ ఔట్...

బంగ్లాదేశ్​ నాలుగో వికెట్​ చేజార్చుకుంది. జట్టు 151 పరుగుల వద్ద సౌమ్యా సర్కార్ (3) ముజీబ్​ రహ్మాన్​ బౌలింగ్​లో ఎల్​బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ముజీబ్​ ఇప్పటికే మ్యాచ్​లో 3 వికెట్లు తీశాడు.

2019-06-24 17:48:36

అఫ్గానిస్థాన్ మ్యాచ్​లో పుంజుకుంది. మంచి టచ్​లో ఉన్న షకిబ్​ (51)... ముజీబ్​ రహ్మాన్​ బౌలింగ్​లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. క్రీజులోకి సౌమ్యా సర్కారు వచ్చాడు. ప్రస్తుతం బంగ్లా 3 వికెట్ల నష్టానికి 143 పరుగులతో ఉంది.

2019-06-24 17:33:06

షకిబుల్​ అర్ధశతకం...

షకిబుల్​ తన అద్భుత ఫామ్​ను కొనసాగిస్తున్నాడు. టోర్నీలో మరో అర్ధ శతకం నమోదు చేశాడు. ప్రస్తతం 50* పరుగులతో క్రీజులో ఉన్నాడు. బంగ్లా 28 ఓవర్లకు 139 పరుగుల వద్ద ఆడుతోంది.

2019-06-24 17:23:35

23 ఓవర్లకు 117 పరుగులు...

బంగ్లాదేశ్​ 23 ఓవర్లకు 117 పరుగులు చేసింది. షకిబ్ (39*), ముష్ఫికర్​ (19*)తో క్రీజులో ఉన్నారు.

2019-06-24 17:10:32

21 ఓవర్లకు 102

బంగ్లాదేశ్​ నెమ్మదిగా జోరు పెంచింది. ముష్ఫికర్​ (9), షకిబుల్ (34)తో క్ ఆడుతున్నారు. బంగ్లా 21 ఓవర్లకు 102 పరుగులతో ఉంది

2019-06-24 17:02:48

ఔటయ్యే ప్రమాదం...

ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు షకిబుల్​ హసన్. రషీద్​ ఖాన్​ వేసిన 18 ఓవర్లో షకిబ్​ను ఎల్బీడబ్యూగా ఆన్​ఫీల్డ్​ అంపైర్​ ప్రకటించాడు. రివ్యూను వినియోగించుకుంది బంగ్లా. రివ్యూలో బంతి వికెట్లను మిస్​ అవుతోంది. థర్డ్​ అంపైర్​ నాటౌట్​గా ప్రకటించాడు. ప్రస్తుతం షకిబుల్ 29 పరుగులతో క్రీజులో ఉన్నాడు. బంగ్లా 19 ఓవర్లలో 89 పరుగులతో ఉంది.

2019-06-24 16:44:39

తమీమ్​ ఔట్​...

ఓవర్​కో ఫోర్​ చొప్పున కొడుతూ జోరు మీదున్న తమీమ్​(36)ను నబీ బౌల్డ్​ చేశాడు. ముష్ఫికర్​ క్రీజులోకి వచ్చాడు.

2019-06-24 16:37:45

లీడింగ్​ స్కోరర్​...

ఈ ప్రపంచకప్​ టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక పరుగుల వీరుడిగా వార్నర్​ను వెనక్కి నెట్టి షకిబుల్​ మళ్లీ అగ్రస్థానానికి వచ్చాడు.

2019-06-24 16:33:51

ఓవర్లో 2 ఫోర్లు...

షకిబుల్​, తమీమ్​ క్రీజులో కుదురుకున్నారు. నయీబ్​ వేసిన 14వ ఓవర్లో 2 ఫోర్లు కొట్టాడు తమీమ్. 15 ఓవర్లకు 74 పరుగులతో ఆడుతోంది బంగ్లా.

2019-06-24 16:22:26

13 ఓవర్లకు 61 పరుగులు...

బంగ్లాదేశ్​ ఓవరుకు 6 పరగుల రన్​రేట్​ను కొనసాగిస్తోంది. తమీమ్​ (24), షకీబుల్​ (21) పరుగులతో ఆడుతున్నారు.

2019-06-24 16:13:49

భాగస్వామ్యం దిశగా బంగ్లా...

వికెట్​ కోల్పోయినప్పటికీ మంచి రన్​రేట్​తో ముందుకు సాగుతోంది బంగ్లాదేశ్​. తమీమ్​కు జత కలిసిన షకిబుల్​ స్ట్రైక్​ రొటేట్​ చేస్తూ స్కోరు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. 10 ఓవర్లకు వికెట్​ నష్టానికి 47 పరుగులుతో ఆడుతోంది బంగ్లా.

2019-06-24 16:11:26

లిటన్​ దాస్​ ఔట్...

జోరు మీదున్న లిటన్​ దాస్​ (16)ను మజీబ్​ ఔట్​ చేశాడు. షాహిదీ కళ్లు చెదిరే క్యాచ్​ అందుకొన్నాడు. క్రీజులోకి షకిబుల్​ వచ్చాడు.

2019-06-24 16:03:34

3 ఓవర్లకు 16 పరగులతో బంగ్లా...

బంగ్లా ఓపెనర్లు అఫ్గాన్​ బౌలింగ్​ దళాన్ని సమర్థంగానే ఎదుర్కొంటున్నారు. ఓవర్​కు 6 పరుగుల చొప్పున కొడుతున్నారు.

2019-06-24 15:58:33

లిటన్ దాస్ క్లాస్...​ 

బంగ్లా ఓపెనర్లలో లిటన్​ దాస్​ మంచి టచ్​లో కనిపిస్తున్నాడు. తొలి రెండు ఓవర్లలో రెండు ఫోర్లు కొట్టాడు. 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్​ కోల్పోకుండా బంగ్లా 13 పరుగులు చేసింది.

2019-06-24 15:46:54

బంగ్లా బ్యాటింగ్​ మొదలు...

స్టేడియంలో అభిమానుల అరుపుల మధ్య బంగ్లా ఓపెనర్లు తమీమ్​ ఇక్బాల్, లిటన్ దాస్ బ్యాటింగ్​కు వచ్చారు. తొలి ఓవర్ రహ్మాన్​ వేస్తున్నాడు.

2019-06-24 15:37:38

రెండేసి మార్పులు...

అఫ్గాన్​, బంగ్లా తమ జట్లలో రెండేసి మార్పులు చేశాయి. బంగ్లాదేశ్​ జట్టు రూబెల్, సబ్బీర్ స్థానంలో  సైఫుద్దీన్, మోసాద్దిక్​ను తీసుకొన్నాయి.

అఫ్గాన్​ జట్టు అలామ్, జజాయ్​ స్థానంలో ధావ్లత్​, షేన్​వారిని బరిలోకి దింపాయి. 

2019-06-24 15:30:17

2019-06-24 15:21:24

అఫ్గాన్​ బౌలింగ్​...

బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకొంది అఫ్గానిస్థాన్​. పిచ్​ స్పిన్​కు సహకరిస్తుందని అఫ్గాన్​ ఆశిస్తోంది. 

2019-06-24 15:16:34

టాస్​ ఆలస్యం...

వర్షం కురిసి ఆగినప్పటికీ ఔట్​ఫీల్డ్​ తడిగా ఉంది. ఇప్పుడే కవర్స్​ తీస్తున్నారు. టాస్​ 10 నిమిషాలు ఆలస్యం కానుంది.

2019-06-24 15:01:33

కాసేపట్లో టాస్​...

మరి కొద్ది నిమిషాల్లో టాస్​ వేయనున్నారు. భారత్​తో అఫ్గాన్​ తలపడిన పిచ్​ మీదే నేడు మ్యాచ్​ జరగనుంది. మరి మరోసారి అఫ్గాన్​ స్పిన్​ మాయాజాలం చూపిస్తుందా? లేక బంగ్లాకు తలొగ్గుతుందా? చూడాలి.

2019-06-24 14:46:57

బంగ్లాదేశ్ X అఫ్గాన్​...

సౌతాంప్టన్ వేదికగా బంగ్లాదేశ్ - అఫ్గానిస్థాన్ మధ్య కాసేపట్లో ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. మధ్యహ్నం 3 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే బంగ్లా ఈ మ్యాచ్​లో గెలవాల్సిందే.

ఈ ప్రపంచకప్​లో ఆడిన 6 మ్యాచుల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించిన బంగ్లాదేశ్​కు సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓడి ఇప్పటికే సెమీస్ ఆశలపై నీళ్లు చల్లుకుంది అఫ్గానిస్థాన్. అయితే బంగ్లాపై గెలిచి వారి సెమీస్​ అవకాశాలను దెబ్బతీస్తామని ఇప్పటికే అఫ్గాన్​ కెప్టెన్​ హెచ్చరించాడు.

జట్ల అంచనా...

బంగ్లాదేశ్​:

మష్రాఫే మోర్తాజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్యా సర్కార్, షకిబుల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్​(కీపర్​), లిటన్ దాస్, మహ్మదుల్లా, సబ్బీర్ రెహమాన్, మెహదీ హసన్, రుబెల్, ముస్తాఫీజుర్ రెహమాన్.

అఫ్గానిస్థాన్​:

గుల్బదీన్ నయీబ్(కెప్టెన్), హజ్రతుల్లా, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ, అస్కర్ అఫ్గాన్, మహ్మద్ నబీ, నజీబుల్లా, రషీద్ ఖాన్, ఇక్రామ్ అలీ(కీపర్), అఫ్తాబ్ ఆలం, ముజీబుర్ రెహమాన్.

2019-06-24 14:41:16

2019-06-24 14:33:28

2019-06-24 14:21:57

2019-06-24 14:02:10

Last Updated : Jun 24, 2019, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details