భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. భారత్ మాజీ ఆటగాడు సచిన్ తెందూల్కర్ పేరిట 17 ఏళ్లుగా ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. వన్డేల్లో 222 ఇన్నింగ్స్‌లో 11 వేల పరుగులు సాధించి... వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఘనతను దక్కించుకున్నాడు. మాంచెస్టర్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదు చేశాడు కోహ్లీ.
సచిన్ తెందూల్కర్ 2002 జనవరి 28న కాన్పుర్‌లో ఇంగ్లాండ్‌పై తన 276 వన్డే ఇన్నింగ్స్‌లో 11 వేల మార్క్‌ను అందుకున్నాడు. 17 ఏళ్లుగా ఏ ఆటగాడు బద్దలు కొట్టలేకపోయిన ఈ రికార్డును కేవలం 222 మ్యాచుల్లోనే కోహ్లీ తిరగరాశాడు.వన్డేల్లో 11 వేల రన్స్ సాధించిన మూడో భారతీయ ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. సచిన తర్వాత ఈ జాబితాలో భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఉన్నాడు. అతడు 288 ఇన్నింగ్స్‌లో 11 వేల పరుగులు చేశాడు.