తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరుణరత్నే రాయల్ గోల్డెన్ డకౌట్

చెస్టర్​లీ స్ట్రీట్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్​లో రాయల్ గోల్డెన్​ డకౌట్​ నమోదైంది. మ్యాచ్​లో తొలి బంతికే లంక బ్యాట్స్​మెన్​ కరుణరత్నెను పెవిలియన్​కు చేర్చాడు రబాడ.

కరుణరత్నే

By

Published : Jun 28, 2019, 5:40 PM IST

ప్రపంచకప్​లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా రాయల్ గోల్డెన్​ వికెట్​ సాధించింది. సఫారీ బౌలర్ రబాడ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే కరుణరత్నె పెవిలియన్ చేరాడు. రబాడ వేసిన పదునైన బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించగా... బంతి బ్యాట్స్‌మన్ గ్లోవ్స్‌కు తాకి సెకండ్ స్లిప్‌లో ఉన్న డుప్లెసిస్ చేతికి చిక్కింది. ఫలితంగా సున్నా పరుగులకే లంక వికెట్ చేజార్చుకుంది. ఈ మెగా టోర్నీలో రెండో రాయల్ గోల్డెన్​ డకౌట్​ ఇది.

ఇదే ప్రపంచకప్​లో ఓల్డ్ ట్రాఫోర్డ్​ మైదానంలో న్యూజిలాండ్​ ఓపెనర్​ గప్తిల్​ను రాయల్ గోల్డెన్​ డకౌట్​ రూపంలో ఔట్​ చేశాడు వెస్టిండీస్​ పేసర్​ కాట్రెల్​.

రాయల్ గోల్డెన్ డకౌట్​ అంటే ?

ఇన్నింగ్స్ ప్రారంభమైన మొదటి బంతికే ఔటైతే దానికి రాయల్ గోల్డెన్ డకౌట్​గా అభివర్ణిస్తారు.

ఇంతకుముందు ప్రపంచకప్​లో రాయల్ గోల్డెన్ డకౌట్​లు

  1. మొదటిసారిగా 1992 ప్రపంచకప్​లో న్యూజిలాండ్ ఆటగాడు జాన్ రైట్​ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో ఈ విధంగా ఔటయ్యాడు.
  2. 2003 ప్రపంచకప్​లో బంగ్లాదేశ్​ ఆటగాడు హనన్ సర్కార్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో రాయల్ గోల్డెన్ డకౌట్​గా వెనుదిరిగాడు.
  3. 2011 వరల్డ్​కప్​లో జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ కెనడాపై ఈ విధంగా ఔటయ్యాడు.

ఇవీ చూడండి.. 'అతడి ఆట చూస్తే మాకు వచ్చే కిక్కే వేరు'

ABOUT THE AUTHOR

...view details