తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: సఫారీల పరుగులకు భారత్​ బౌలర్ల అడ్డుకట్ట - దక్షిణాఫ్రికా

సౌతాంప్టన్ వేదికగా భారత్​తో జరుగుతున్న మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో దక్షిణాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. మోరిస్​, రబాడా, డూప్లెసిస్​ రాణించారు. భారత స్పిన్నర్ చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

WC19: సఫారీల పరుగులకు భారత్​ బౌలర్లు అడ్డుకట్ట

By

Published : Jun 5, 2019, 6:55 PM IST

Updated : Jun 5, 2019, 11:34 PM IST

సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో భారత బౌలర్లు సత్తాచాటారు. భారత​ బౌలర్ల ధాటికి సఫారీ జట్టు 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. వరుస విరామాల్లో ప్రోటీస్​ బ్యాట్స్​మెన్​ను పెవీలియన్​కు పంపింది టీమ్​ఇండియా. చివర్లో ఆల్​రౌండర్​ మోరిస్(42)​ దూకుడుగా ఆడటం వల్ల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

ప్రోటీస్​ సారథి డూప్లెసిస్(38), బౌలర్​ రబాడా(31*) మిల్లర్(31) మినహా మిగతా బ్యాట్స్​మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లతో రాణించగా.. బుమ్రా, భువనేశ్వర్​ రెండేసి వికెట్లు తీశారు.

బుమ్​.. బుమ్​.. బుమ్రా..

టాస్ గెలిచి బ్యాటింగ్​కు దిగిన ప్రొటీస్ జట్టుకు ఆరంంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో ఓవర్​లోనే ఆమ్లాను బుమ్రా ఔట్​ చేశాడు. బుమ్రా స్వింగ్​ను ఎదుర్కోలేక స్లిప్​లో రోహిత్​కు క్యాచ్​ ఇచ్చాడు ఆమ్లా. అప్పటికీ దక్షిణాఫ్రికా స్కోరు 11 పరుగులే. అనంతరం కాసేపటికే డికాక్​ను కూడా పెవిలియన్ చేర్చాడు బుమ్రా. 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది దక్షిణాఫ్రికా.

తిప్పేసిన చాహల్..

తర్వాత క్రీజులోకి వచ్చిన డూప్లెసిస్, డసెన్ జోడి నిలకడగా ఆడింది. వీరిద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీశాడు చాహల్. ఓకే ఓవర్లో డసెన్, డూప్లెసిస్​ను ఔట్ చేసి సఫారీలను కోలుకోలేని దెబ్బతీశాడు. డుమినిని కుల్​దీప్ యాదవ్​ పెవీలియన్​కు పంపాడు. 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది ప్రొటీస్​.

చివర్లో మోరిస్​ మెరుపులు...

ఆ తర్వతా క్రీజులోకి వచ్చిన మిల్లర్​, పెలుక్వాయో వికెట్ల పతానాన్ని కొంత సేపు అడ్డుకున్నారు. మిల్లర్​ను ఔట్ చేసి మళ్లీ మ్యాచ్​ను మలుపు తిప్పాడు చాహల్. కాసేపటికే ఫెలుక్వాయోను కూడా స్టంపింగ్​ ద్వారా వెనక్కిపంపాడు. ఆ తర్వాత వచ్చిన క్రిస్​ మోరిస్​ దూకుడుగా ఆడి దక్షిణాఫ్రికా స్కోరును పెంచేశాడు. 42 పరుగులతో ప్రోటీస్​ జట్టు టాప్​ స్కోరర్​గా నిలిచాడు. రబాడా కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. 49వ ఓవర్​ తొలి బంతికి మోరిస్​ను భువనేశ్వర్​ ఔట్​ చేసి ఈ జోడిని విడదీశాడు. చివరి బంతికి తాహిర్​ను ఔట్​ చేశాడు భువి.

తొలుత బౌన్సర్లు, స్పిన్​తో విరుచుకుపడ్డ టీమ్​ ఇండియా బౌలర్లు దక్షిణాఫ్రికాను నిలువరించడంలో సఫలమయ్యారు.

Last Updated : Jun 5, 2019, 11:34 PM IST

ABOUT THE AUTHOR

...view details