తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రాక్టీస్​ మ్యాచ్​లో భారత్​ టాప్​ ఆర్డర్​ విఫలం - ఇండియా

న్యూజిలాండ్​తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్​లో భారత్​ 21 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. క్రీజులో ధోనీ, జడేజా ఉన్నారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 4, గ్రాండ్​హోమ్, బ్లండెల్​ చెరో వికెట్ తీసుకున్నారు.

మ్యాచ్​

By

Published : May 25, 2019, 4:46 PM IST

లండన్​ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతున్న ప్రాక్టీస్​ మ్యాచ్​లో భారత్​ ఇన్నింగ్స్ నిదానంగా సాగుతోంది. వందలోపే 6 వికెట్లు కోల్పోయి పరుగుల కోసం పాకులాడుతోంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కె ఎల్ రాహుల్​ వెంటవెంటనే పెవిలియన్ చేరారు. 21ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది కోహ్లీ సేన. క్రీజులో ధోనీ(11), జడేజా(2) ఉన్నారు.

39కే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత్​. బౌల్ట్ 3 వికెట్లు తీయగా.. గ్రాండ్​ హోమ్​, బ్లండెల్​ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

న్యూజిలాండ్ బౌలర్లు భారత్​పై ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. రెండో ఓవర్లనే రోహిత్ శర్మను(2) ఎల్బీడబ్ల్యూ చేశాడు కివీస్ బౌలర్ ట్రెంట్​ బౌల్ట్. అనంతరం వెంటవెంటనే శిఖర్​ధావన్​(2), లోకేశ్ రాహుల్​ను ఔట్ చేశాడు బౌల్ట్​. కాసేపు కోహ్లీ(18) నిలకడగా ఆడినా.. గ్రాండ్​హోమ్ చేతిలో ఔటయ్యాడు. హర్ధిక్​ను(30) పెవిలియన్ పంపాడు బ్లండెల్​.

ABOUT THE AUTHOR

...view details