విరాట్ కోహ్లీని ఓ చక్రవర్తిలా చూపిస్తూ ఐసీసీ చేసిన ట్వీట్‌పై ఇంకా నెట్టింట చర్చ కొనసాగుతోంది. ఇప్పటికీ పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు ఐసీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'ఏ జట్టు కెప్టెన్‌కూ ఇవ్వని గౌరవం ఇండియా సారిథికి మాత్రమే ఎందుకు' అని కొందరు, 'బీసీసీఐ.. ఐసీసీని సొంతం చేసుకుందని' మరికొందరు విమర్శలు కురిపించారు. 'ఐసీసీ టీమిండియా అభిమానిలా వ్యవహరిస్తోంది' అని కామెంట్ల వర్షం కురిపించారు నెటిజన్లు.
ఈ వివాదంపై ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ స్పందిస్తూ... ఐసీసీ చేసిన ట్వీట్ నిష్పక్షపాతంగా లేదంటూ పేర్కొన్నాడు.