తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మేం ప్రస్తుతం పటిష్ఠంగా ఉన్నాం'

సోమవారం శ్రీలంకపై వార్మప్ మ్యాచ్​లో నెగ్గింది ఆస్ట్రేలియా. ప్రస్తుతం తమ జట్టు గొప్ప స్థితిలో ఉందని,  ఆటగాళ్లందరూ ఫామ్​లో ఉన్నారని కంగారూ కెప్టెన్ ఫించ్ మ్యాచ్​ అనంతరం తెలిపాడు.

By

Published : May 28, 2019, 12:32 PM IST

ఆరోన్ ఫించ్

పది నెలల క్రితంతో పొల్చుకుంటే ప్రస్తుతం తమ జట్టు మంచి స్థితిలో ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్​ తెలిపాడు. బాల్​ ట్యాంపరింగ్ వివాదం తర్వాత వరుసగా సిరీస్​లు కోల్పోయి అప్పుడు వెనకంజలో ఉన్నామని శ్రీలంకతో వార్మప్ మ్యాచ్​ అనంతరం చెప్పాడు.

"ప్రస్తుతం మేము మంచి స్థితిలో ఉన్నాం. పది నెలల క్రితంతో పోల్చుకుంటే జట్టు పటిష్ఠంగా ఉంది. అందరూ ఫామ్​లో ఉన్నారు" -ఆరోన్ ఫించ్, ఆస్ట్రేలియా సారథి

గత ఏడాది బాల్ ట్యాంపరింగ్ వివాదంతో కంగారూ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ సంవత్సరం పాటు అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడకుండా నిషేధం ఎదుర్కొన్నారు. అనంతరం ఇంగ్లాండ్, సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ కోల్పోయింది ఆసీస్​. సొంతగడ్డపై భారత్​తో టెస్ట్​ సిరీస్​లోనూ ఓడింది.

అయితే ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్​గా బరిలో దిగుతున్న ఆస్ట్రేలియా వార్మప్​ మ్యాచుల్లో సత్తా చాటింది. ఇంగ్లాండ్, శ్రీలంకపై విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది ఆసీస్.

ఇది చదవండి:మిడిలార్డల్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా..?

ABOUT THE AUTHOR

...view details