ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 119 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది ఇంగ్లాండ్. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరిగిన ఈ పోరులో కివీస్ 186 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న 306 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ ముందుంచింది ఇంగ్లీష్ జట్టు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లో టామ్ లాథమ్(57) మినహా మిగతా వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
ఇంగ్లీష్ బౌలర్లలో మార్క్‌వుడ్ 3 వికెట్లు తీయగా.. వోక్స్, ప్లంకెట్, ఆర్చర్, స్టోక్స్, అదిల్ రషీద్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. శతకంతో ఆకట్టుకున్న ఇంగ్లాండ్ ఓపెనర్ బెయిర్ స్టోకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
కివీస్‌కు దక్కని శుభారంభం..
306 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 2 పరుగుల వద్దే ఓపెనర్ హెన్రీ నీకోలస్ను డకౌట్ చేశాడు వోక్స్. అనంతరం కాసేపటికే మరో ఓపెనర్ గప్తిల్‌ను(8) పెవిలియన్ చేర్చాడు జోఫ్రా ఆర్చర్. 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న కివీస్‌ను విలియమ్సన్ - రాస్ టేలర్ జోడీ ఆదుకునే ప్రయత్నం చేసింది.
రనౌట్ అయిన విలియమ్సన్, టేలర్..