తెలంగాణ

telangana

ETV Bharat / sports

సెమీస్ లక్ష్యంగా ఇంగ్లాండ్...గెలుపు కోసం అఫ్గాన్ - క్రికెట్

ప్రపంచకప్​లో నేడు ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అఫ్గాన్​పై గెలిచి సెమీస్​కు చేరువ కావాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. గాయాలతో సతమతమవుతున్న ఆతిథ్యజట్టుపై నెగ్గి మొదటి విజయాన్ని నమోదు చేయాలని ఊవిళ్లూరుతోంది అఫ్గానిస్థాన్.

సెమీస్ లక్ష్యంగా ఇంగ్లండ్...గెలుపు కోసం అఫ్గాన్

By

Published : Jun 18, 2019, 5:33 AM IST

Updated : Jun 18, 2019, 8:46 AM IST

ప్రపంచకప్​లో నేడు ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అఫ్గాన్​పై నెగ్గి సెమీస్ అవకాశాలను మెరుగుపరచుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతున్న అఫ్గాన్.. అతిథ్య​ జట్టుపై గెలిచి సంచనం సృష్టించాలని తహతహలాడుతోంది.

స్టార్ ఆటగాళ్లు గాయాల పాలు కావడం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు తలనొప్పిగా మారింది. వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్, ఓపెనర్​ జేసన్ రాయ్ ఫిట్​నెస్ సమస్యలతో మైదానాన్ని వీడడం ఇంగ్లాండ్​ను ఆందోళనకు గురి చేస్తోంది.


అఫ్గాన్​తో మ్యాచ్ ప్రారంభయ్యేంత వరకు మోర్గాన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. మోర్గాన్ మ్యాచ్​కు దూరమైతే వైస్ కెప్టెన్ జోస్​ బట్లర్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. కరన్​ లేదా మొయిన్ అలీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

న్యూజిలాండ్​తో మినహా అన్ని మ్యాచ్​ల్లో 40 ఓవర్ల లోపలే అఫ్గాన్ ఆలౌటైంది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయి, నూర్ అలీ జర్దాన్, ఆల్​రౌండర్​ రషీద్​ ఖాన్ మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. పిచ్ పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలిస్తే రషీద్, నబీ చెలరేగే అవకాశం ఉంది.

జట్లు :

ఇంగ్లాండ్ :

ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్​స్టో, జోస్ బట్లర్, కరన్​, లియామ్ డాసన్, ప్లంకెట్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, జేమ్స్ విన్స్, క్రిస్ ఓక్స్, మార్క్ ఉడ్.

అఫ్గానిస్థాన్ :

గుల్బాదిన్​ నైబ్​(కెప్టెన్), నూర్ అలీ జర్డాన్​, హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, అస్గర్ అఫ్గాన్, హష్మతుల్లా షాహిదీ, నజీబుల్లా జర్డాన్​, సమీవుల్లా షన్​వారీ, మహ్మద్ నబీ, రషీద్​ ఖాన్, దవ్లాత్ జర్డాన్​, అఫ్తాబ్​ ఆలం, హమీద్ హసన్, ముజీబుర్​ రహమాన్, ఇక్రమ్ అలీ ఖిల్.

ఇదీ చూడండి: 'కెప్టెన్​ మెదడు లేనోడు... అందుకే పాక్​ ఓడింది'

Last Updated : Jun 18, 2019, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details