తెలంగాణ

telangana

ETV Bharat / sports

అరే భాయ్ బర్త్​డే కేక్ ఎక్కడా..! - captain

మహేంద్రసింగ్ ధోనికి రోహిత్ శర్మ  విభిన్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అరే భాయ్ కేక్ ఎక్కడా అంటూ ట్వీట్ చేశాడు హిట్ మ్యాన్.

రోహిత్​ - ధోని

By

Published : Jul 7, 2019, 8:11 PM IST

సామాజిక మాధ్యమాల్లో ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానుల నుంచి ఆత్మీయుల వరకు అందరూ మిస్టర్​ కూల్​కు విషెస్ చెబుతున్నారు. తాజాగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వినూత్న రీతిలో జన్మదిన శుభాకంక్షలు తెలిపాడు.

"అరే భాయ్ కేక్ ఎక్కడ? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశాడు హిట్ మ్యాన్​.

1981 జులై 7న జన్నించిన ధోని నేడు తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దేశవ్యాప్తంగా మహీ జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నారు అభిమానులు. విభిన్న రీతుల్లో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

2004లో భారత్​ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మహీ సారథిగా 2007 ఐసీసీ టీ 20 వరల్డ్​కప్​, 2011 ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్​ ట్రోఫి అందించాడు.

ABOUT THE AUTHOR

...view details