ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్ 14వ మ్యాచ్‌లో భారత్ భారీస్కోరు దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ శతకంతో ఆకట్టుకున్నాడు. 95 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసి కెరీర్లో 17వ సెంచరీ నమోదు చేశాడు. ఇందులో 13 ఫోర్లు ఉన్నాయి. ధావన్‌కు ఈ మైదానంలో ఇది మూడో శతకం.
WC19: ఆసీస్‌పై శిఖర్ శతకం బాదేశాడు - dhavan
లండన్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఓపెనర్ ధావన్ శతకంతో అదరగొట్టాడు. 95 బంతుల్లో 100 పరుగులు పూర్తిచేశాడు.
శిఖర్ ధావన్
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు ధావన్, రోహిత్(57) నిలకడగా ఆడారు. శిఖర్ ధాటిగా బ్యాటింగ్ చేయగా... రోహిత్ సమయోచితంగా ఆడుతూ స్కోరు వేగం పెంచాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అర్ధశతకం చేసి రోహిత్.. కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, ధావన్ ఉన్నారు.