ప్రపంచకప్‌లో టీమిండియా ఆకట్టుకునే ప్రదర్శనలు చేస్తోంది. ఇంగ్లాండ్ మినహా అన్ని జట్లపైనా విజయాలు సాధించింది. కోహ్లీసేనకు మద్దతు తెలిపేందుకు టోర్నీ అతిథ్యమిస్తోన్న ఇంగ్లండ్‌కు వేల సంఖ్యలో భారత అభిమానులు చేరుకున్నారు. వీరు సుమారుగా 80 వేల మందిపైగా ఉంటారని బ్రిటీష్ డిప్యూటీ హైకమీషనర్ జాన్ థాంప్సన్ సోమవారం వెల్లడించారు.
"మా అంచనా ప్రకారం ప్రపంచకప్ మ్యాచ్‌లు చూసేందుకు భారత్ నుంచి సుమారు 80వేల మంది ఇక్కడికి వచ్చారు. ఈ సమయానికి సాధారణంగా పర్యటకుల రద్దీ ఉంటుంది. ఇది ఇంకా పెరగడానికి మరో కారణం క్రికెట్" -జాన్ థాంప్సన్, బ్రిటీష్ డిప్యూటీ హైకమీషనర్