టీమిండియా స్పిన్నర్ చాహల్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తన వన్డే కెరీర్‌లో అత్యధిక పరుగులను సమర్పించుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో చాహల్ పది ఓవర్లు బౌలింగ్ వేసి 88 పరుగులిచ్చాడు. ఇది చాహల్‌కు వన్డేల్లో చెత్త ప్రదర్శనగా నమోదైంది. అలాగే ప్రపంచకప్‌లో ఓ భారత బౌలర్ ఇన్ని పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి.
చాహల్ ఖాతాలో చెత్త రికార్డు..
భారత స్పిన్నర్ చాహల్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో తన వన్డే కెరీర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్నాడు. ప్రపంచకప్‌లో ఓ భారత బౌలర్ ఇన్ని పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి.
చాహల్
ఇంతకుముందు వన్డేల్లో ఎప్పుడూ చాహల్ ఇంత భారీగా పరుగులు సమర్పించుకోలేదు. ఈ ప్రపంచకప్‌లో ఇది మూడో చెత్త బౌలింగ్ ప్రదర్శన. ఈ మెగా టోర్నీలో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్(110 పరుగులు-ఇంగ్లాండ్‌పై), శ్రీలంక పేసర్ నువాన్ ప్రదీప్(88-ఆస్ట్రేలియా)లు అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు. ఆ తర్వాత స్థానం చాహల్‌దే కావడం గమనార్హం.
ఇవీ చూడండి.. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో పంత్‌కు ఛాన్స్