తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆసీస్​తో ఓడినా.. సెమీస్ ఆశలు మిగిలే ఉన్నాయి' - bangla

ఆసీస్​తో మ్యాచ్​లో ఓడినప్పటికీ ప్రపంచకప్​ సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయని బంగ్లాదేశ్​ కెప్టెన్ మోర్తాజా అభిప్రాయపడ్డాడు. మిగిలిన మూడు మ్యాచుల్లో సత్తాచాటుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మోర్తాజా

By

Published : Jun 21, 2019, 1:56 PM IST

ఆస్ట్రేలియాతో ఓడినప్పటికీ ప్రపంచకప్​ సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రాఫే మోర్తాజా తెలిపాడు. మూడు మ్యాచ్​లు మిగిలున్నాయని.. వాటిలో గెలిచి సెమీస్​కు అర్హత సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"మాకు ఇంకా మూడు మ్యాచ్​లు మిగిలున్నాయి. అన్ని మ్యాచుల్లో గెలిచినా.. సెమీస్ అవకాశం కష్టమే. కానీ మా ప్రయత్నం ఆపబోం. ఇంకా కష్టపడి మా ప్రదర్శనను మెరుగుపర్చుకుంటాం" -మోర్తాజా బంగ్లా సారథి.

నాటింగ్​హామ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో 48 పరుగుల తేడాతో ఓడింది బంగ్లాదేశ్. ఇప్పటివరకు 6 మ్యాచ్​లు ఆడిన బంగ్లా జట్టు.. రెండింటిలో గెలిచి మూడు మ్యాచుల్లో పరాజయం చెందింది. ఓ మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది.

పది దేశాలు పోటీపడుతున్న ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​ల ఫలితాల ప్రకారం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, భారత్​ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. టాప్ -4 లో నిలిచిన జట్లు సెమీస్​కు అర్హత సాధిస్తాయి.

ABOUT THE AUTHOR

...view details