సెమీస్‌లో అడుగుపెట్టాలంటే బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలవాల్సిన పాక్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. ప్రారంభంలో బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా ప్రారంభంలోనే ఫకర్ జమాన్ (13) వికెట్ కోల్పోయింది పాక్ జట్టు. మొదటి పది ఓవర్లలో 38 పరుగులే చేసింది సర్ఫరాజ్ సేన.
అనంతరం మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం జాగ్రత్తగా ఆడుతూ పరుగులు సాధించారు. ఇమామ్ కాస్త నెమ్మదిగా ఆడితే.. బాబర్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధసెంచరీలు సాధించారు. రెండో వికెట్‌కు 157 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక బాబర్ ఆజం ఔటయ్యాడు. 96 పరుగులు చేసిన బాబర్ కొద్దిలో సెంచరీ మిస్సయ్యాడు.
అనంతరం ఇమామ్... హఫీజ్‌తో కలిసి 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 100 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అనంతరం ముస్తఫిజుర్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. హరీస్ సోహైల్ (6), ఇమాద్ వాసీం (26) విఫలమయ్యారు. అనంతరం వచ్చిన సారథి సర్ఫరాజ్ అహ్మద్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సైఫూద్దీన్ వేసిన బంతిని ఇమాద్ బలంగా బాదగా... అది నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సర్ఫరాజ్ తాకింది. ఫలితంగా పాక్ సారథి వెనుదిరిగాడు.