తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: నిలకడగా బంగ్లా బ్యాట్స్​మెన్​ - worldcup

లండన్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్​లో బంగ్లాదేశ్​ బ్యాట్స్​మెన్ ఆకట్టుకుంటున్నారు. క్రీజులో ఉన్న షకిబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ నిలకడగా ఆడుతున్నారు.

బంగ్లాదేశ్

By

Published : Jun 2, 2019, 5:10 PM IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్​లో బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. లండన్ ఓవల్​ వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్​లో బంగ్లా ఆటగాళ్లు సత్తాచాటుతున్నారు. ఓపెనర్ సౌమ్యా సర్కార్ 42 పరుగులు చేసి ఔటవ్వగా, షకిబుల్ హసన్ 43 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. ప్రొటీస్ బౌలర్లలో ఫెలుక్వాయో, క్రిస్ మోరిస్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన బంగ్లా జట్టుకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, సౌమ్యా సర్కార్ జోడి తొలి వికెట్​కు 60 పరుగులు చేసింది. తమీమ్​ను ఫెలుక్వాయో ఔట్​ చేసి వీరి జోడిని విడదీశాడు.

డికాక్ కళ్లు చెదిరే క్యాచ్​..

తమీమ్​ నెమ్మదిగా ఆడినా.. సౌమ్యా సర్కార్ సఫారీ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. 30 బంతుల్లోనే 42 పరుగులు చేసి మోరిస్ బౌలింగ్​లో ఔటయ్యాడు సర్కార్​. కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకున్నాడు ప్రొటీస్ కీపర్ డికాక్.

వీరిద్దరూ ఔటైన తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన షకిబుల్ హసన్- ముష్ఫికర్ రహీమ్ ద్వయం మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడుతోంది. వీరిద్దరూ ఇప్పటికే 100 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేసి ఆట కొనసాగిస్తున్నారు. షకీబ్,ముష్ఫికర్ ఇరువురు అర్ధశతకాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details