తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ, ధోని అప్పుడు ఇప్పుడు ఒకేలా..!

2015 ప్రపంచకప్ సెమీస్​ మ్యాచ్​కు ఈ రోజు జరిగిన సెమీస్​కు కొన్ని పోలికలు ఉన్నాయి. రెండు సార్లు విరాట్ కోహ్లీ ఒక్క పరుగుకే వెనుదిరగగా.. ధోని రనౌట్​గా పెవిలియన్ చేరాడు.

విరాట్ - ధోని

By

Published : Jul 10, 2019, 10:12 PM IST

న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్ మ్యాచ్​లో భారత్ పరాజయం చెంది మెగాటోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే 2015 ప్రపంచకప్​ సెమీస్​, ఈ రోజు జరిగిన సెమీస్​ మ్యాచ్​లో కొన్ని పోలికలు ఉన్నాయి.

  • ఈ రెండు టోర్నీల్లో భారత్ సెమీస్​లోనే వెనుదిరిగింది.
  • 2015లో విరాట్ కోహ్లీ ఒక్క పరుగుకే ఔట్ కాగా.. ఈ రోజు మ్యాచ్​లోనూ ఒకే పరుగు చేసి పెవిలియన్ చేరాడు.
  • 2015 సెమీస్​ మ్యాచ్​లో మహేంద్ర సింగ్ ధోని(65) అర్ధశతకం చేసి రనౌట్​ అయ్యాడు. ఈరోజు కూడా అర్ధసెంచరీ చేసి రనౌట్​గా పెవిలియన్ చేరాడు.
  • ఈ రెండు సెమీస్ మ్యాచ్​ల్లోనూ భారత్ టాస్ ఓడి బౌలింగ్ చేసింది. లక్ష్య ఛేదనలో పరాజయం చెందింది.
    2015, 2019 ప్రపంచకప్​లో ధోని రనౌట్లు

మాంచెస్టర్ వేదికగా కివీస్​తో జరిగిన వరల్డ్​కప్​ సెమీస్​ మ్యాచ్​లో భారత్​ 18 పరుగల తేడాతో ఓడింది. ప్రపంచకప్​ టోర్నీల్లో ఇప్పటి వరకు ఎనిమిది సార్లు సెమీస్ చేరిన కివీస్.. ఆరు సార్లు ఓడగా.. రెండు సార్లు ఫైనల్​ (2015, 2019) చేరింది.

ఇది చదవండి: "45 రోజుల కష్టం 45 నిమిషాల్లో చేజారింది"

ABOUT THE AUTHOR

...view details