యువీ అభిమానులకు శుభవార్త! టీమిండియా ప్రపంచకప్ హీరో, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి అందరినీ అలరించబోతున్నాడు. ఐతే ఈ సారి బ్యాట్, బంతితో కాదు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. అవును, యువీ ఓ వెబ్‌సిరీస్‌లో నటించనున్నాడు. అసోంకు చెందిన డ్రీమ్‌హౌజ్ ప్రొడక్షన్స్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇందులో యువీ సతీమణి హజెల్ కీచ్ కీలక పాత్రలో, సోదరుడు జొరావర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. యువీ తల్లి షబ్నమ్ సింగ్.. ఈ వెబ్‌సిరీస్ నిర్మాణంలో భాగస్వామిగా మారనుందట.
"ఈ ప్రపంచం.. అసలైన యువరాజ్ సింగ్, జొరావర్ సింగ్‌ను వీక్షించనుంది. ఈ వెబ్‌సిరీస్‌లో ముఖ్య పాత్రను నా చిన్న కొడుకు జొరావర్ పోషిస్తున్నాడు. నా కోడలు, నా కుమారులను చూసి ఒక తల్లిగా ఎంతో గర్విస్తున్నా"