తెలంగాణ

telangana

ETV Bharat / sports

అక్తర్​కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన యువీ - jofra archer

బంతి తగిలి బాధపడుతున్న స్మిత్​ను ఓదార్చకుండా ఏం పట్టనట్టు ఉండిపోయిన జోఫ్రా ఆర్చర్​ను ట్విట్టర్​ వేదికగా తప్పు పట్టాడు పాక్ మాజీ ఆటగాడు అక్తర్. బౌన్సర్లు మరిన్ని వస్తాయి కాచుకోమని నువ్వు(అక్తర్) చెప్పేవాడివంటూ వెటకారంగా రిప్లై ఇచ్చాడు యువీ.

యువరాజ్ - అక్తర్

By

Published : Aug 19, 2019, 6:20 PM IST

Updated : Sep 27, 2019, 1:27 PM IST

యాషెస్​ రెండో టెస్టులో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ప్రవర్తించిన తీరు తనకు నచ్చలేదని ట్వీట్ చేశాడు పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయభ్​ అక్తర్. బౌన్సర్ తగిలి స్మిత్ బాధపడుతుంటే ఆర్చర్ ఏమి పట్టనంటూ వెళ్లిపోయాడని పోస్ట్ చేశాడు. అయితే ఈ ట్వీట్​కు భారత మాజీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చాడు.

"బౌలర్​ బౌన్సర్​ వేయడం.. బంతి బ్యాట్స్​మన్​కు తగలడం ఇవన్నీ ఆటలో భాగం. కానీ జోఫ్రా ఆర్చర్ ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదు. స్మిత్ బంతి తగిలి కిందపడినపుడు ఎలా ఉందని అడగకుండా ఏమి పట్టనట్టు వెళ్లిపోయాడు. నేనైతే అలా చేసే వాడిని కాదు" -షోయబ్​ అక్తర్​, పాక్ మాజీ ఆటగాడు.

అక్తర్ ట్వీట్​కు యువరాజ్​ సింగ్ స్పందించాడు.

"అవును నిజమే ముందు నువ్వే వెళ్లి అడిగేవాడివి. ఇలాంటివి(బౌన్సర్లు) మరిన్ని వస్తాయి.. కాచుకోమని చెప్పేవాడివి" -యువరాజ్ సింగ్, భారత మాజీ క్రికెటర్.

శనివారం జరిగిన నాలుగో రోజు మ్యాచ్​లో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గంటకు 148 కిలో మీటర్ల వేగంతో బంతిని వేశాడు. బ్యాటింగ్ చేస్తోన్న స్మిత్​ తలకి బంతి తగిలింది. కింద పడిపోయిన ఆసీస్​ ఆటగాడిని పలకరించకుండా ఆర్చర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్​లో స్మిత్ రిటైర్డ్​ హర్ట్​గా వెనుదిరిగాడు. రెండో టెస్టు డ్రాగా ముగిసింది.

ఇది చదవండి: ఆర్చర్​ తీరుపై షోయబ్​ అక్తర్​ మండిపాటు

Last Updated : Sep 27, 2019, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details