ఇటీవలే రిటైర్మెంట్ తీసుకున్న భారత క్రికెటర్ యువరాజ్ సింగ్.. విదేశీ టోర్నీల్లో ఆడేందుకు అనుమతివ్వాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి లేఖ రాశాడు. వినోదాన్ని ఆస్వాదించేందుకే ఈ లీగ్‌ల్లో ఆడుతున్నానని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
"నేను విదేశాల్లో జరిగే టీ20 క్రికెట్లో పాల్గొనాలనుకుంటున్నా. నా వయసు దృష్ట్యా ఆనందం కోసమే క్రికెట్ ఆడాలనుకుంటున్నా. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ ఆడటమనేది ఒత్తిడితో కూడుకున్నది" -యువరాజ్ సింగ్, క్రికెటర్
విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకుగత వారమే యువరాజ్.. బీసీసీఐ అనుమతి కోరాడు. కానీ.. అప్పటికి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించని కారణంగా ఆ విషయాన్ని తిరస్కరించింది బోర్డు.