తెలంగాణ

telangana

ETV Bharat / sports

యువీ హార్ట్​ టచింగ్ వీడియో! - video

భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం తన ఫేస్​బుక్ పేజీలో ఓ వీడియోను పోస్టు చేశాడు. క్రికెట్​తో తనకున్న అనుబంధాన్ని అందులో చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​ అవుతోంది.

యువీ

By

Published : Jun 10, 2019, 9:55 PM IST

అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన యువరాజ్ సింగ్ తన ఫేస్​బుక్ పేజీలో ఓ వీడియో షేర్ చేశాడు. క్రికెట్​ తనకు చాలా నేర్పిందని, జీవితంలో ఆనందాలతో పాటు గడ్డు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలిసిందని ఆ వీడియోలో చెప్పాడు యువీ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఫేస్​బుక్​ పేజీలో వీడియోతో పాటు సందేశాన్ని రాశాడు యువరాజ్.

"క్రికెట్ నాకు అన్ని ఇచ్చింది. నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం క్రికెట్టే. ఈ గేమ్​తో అనురాగ- ద్వేషాలతో కూడిన సంబంధముంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఆట నాకు ఎంతో నేర్పింది. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాను. జీవితంలో ఒడుదొడుకులను ఎలా ఎదుర్కోవాలో ఇక్కడే నేర్చుకున్నాను.

నా జీవితంలో విజయాలకంటే ఓటములే ఎక్కువ ఉన్నాయి. కానీఏనాడు వెనుదిరగాలనుకోలేదు. నా చివరి శ్వాస వరకు పోరాడలనుకున్నా. క్రికెట్ నాకు నేర్పింది ఈ విషయమే. ఆట కోసం నా చెమటను, రక్తాన్ని చిందించాను.

నన్ను నిజంగా అభిమానించే వారు కష్టకాలంలోనూ నాకు మద్దతుగా ఉన్నారు. మీకు కృతజ్ఞతలు చెప్పి మీ రుణాన్ని తీర్చుకోలేను. ఎవరు ఏమన్నా.. మిమ్మల్ని మీరు నమ్మండి. అప్పుడే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు.

దేశం కోసం మ్యాచ్​ ఆడుతున్నప్పుడు నా ఫీలింగ్ మాటల్లో చెప్పలేను.. ఆటకు ముందు జాతీయగీతం పాడుతున్నప్పుడు.. జెండాను పట్టుకున్నప్పుడు.. పరుగు తీసే ప్రతిసారి నా రక్తం ఉద్రేకంతో పరుగులు తీసింది" అని తన ఫేస్​బుక్ పేజీలో రాశాడు యువీ. ప్రస్తుతం ఈ వీడియో చూసిన వాళ్లంతా హార్ట్​ టచింగ్​గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

అంతర్జాతీయ క్రికెట్​తో పాటు ఐపీఎల్, ఫస్ట్​క్లాస్ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు యువరాజ్​.

ABOUT THE AUTHOR

...view details