తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రవిశాస్త్రితో విభేదాలా..? అదేం లేదు' - Sourav Ganguly on Ravi Shastri

టీమిండియా కోచ్ రవిశాస్త్రితో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. అవన్నీ పుకార్లని కొట్టిపారేశాడు. ఐసీసీ టోర్నీల్లో గెలవాలంటే ఆటగాళ్లు మానసిక అడ్డంకులను అధిగమించాలని సూచించాడు.

Sourav Ganguly
గంగూలీ

By

Published : Dec 7, 2019, 8:42 AM IST

గత విభేదాలను దృష్టిలో పెట్టుకొని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రిపై కక్షపూరితంగా వ్యవహరిస్తామనడంలో అర్థం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. అవన్నీ వదంతులేనని తెలిపాడు. పదవీకాలంలో చేసిన ప్రదర్శనల ఆధారంగానే వ్యక్తుల పనితీరు అంచనా వేస్తారని స్పష్టం చేశాడు. 2016లో అనిల్‌కుంబ్లేను కోచ్‌గా ఎంపిక చేయడంలో దాదా కీలక పాత్ర పోషించాడు. అప్పుడు ఇంటర్వ్యూకు హాజరైన శాస్త్రికి ఈ పదవి దక్కలేదు. ఈ కారణంగా గంగూలీ వల్లే తనకు పదవి దక్కలేదని శాస్త్రి విమర్శించాడు. దాదా కూడా ప్రతివిమర్శలు చేశాడు.

"అందుకే వాటిని పుకార్లు అంటారు. అలాంటి ప్రశ్నలకు నా వద్ద జవాబులు ఉండవు. ఎవ్వరైనా పనితీరు బాగుంటే కొనసాగుతారు. లేదంటే మరొకరు ఆ పదవిలో భర్తీ అవుతారు. నేను క్రికెట్‌ ఆడుతున్నప్పుడే అంతే. మాటలు, లీకులు, వదంతులు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఏకాగ్రత 22 గజాల్లో ఏం జరుగుతుందన్న దానిపై ఉండాలి. జీవితమంతా పనితీరుపై ఆధారపడుతుంది. దానికి ప్రత్యామ్నాయం ఉండదు"
-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ఐసీసీ టోర్నీల్లో గెలవాలంటే ఆటగాళ్లు మానసిక అడ్డంకులను అధిగమించాలని అన్నాడు గంగూలీ. టీ20 అనేది స్వేచ్ఛగా ఆడే నిర్భయ క్రికెట్ అని తెలిపాడు.

"విరాట్‌ కోహ్లీ భారత క్రికెట్లో కీలక వ్యక్తి. అతడు మైదానంలో జట్టును నడిపిస్తాడు. మైదానంలో, బయటా అతడో రోల్‌ మోడల్‌. విజయవంతం అవ్వడానికి కావాల్సిన ప్రోత్సాహం రవి, విరాట్‌కు దొరుకుతుంది. ఏదేమైనా చివరికి మేం ఆశించేది ఫలితాలే. ఐసీసీ టోర్నీల్లో సెమీస్‌, ఫైనల్లో గెలవడం సామర్థ్యానికి సంబంధించింది కాదు. అది మానసికమైంది. పెద్ద మ్యాచుల్లో ఆటగాళ్లు మానసిక అడ్డంకులు అధిగమించాలి. టీ20 అనేది స్వేచ్ఛగా ఆడే నిర్భయ క్రికెట్‌. జట్టులో స్థానం కోసం ఆడకూడదు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన వల్ల మాజీ క్రికెటర్లు పనిచేసేందుకు ఇబ్బందులు వస్తున్నాయి."
-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

"బీసీసీఐ కార్యదర్శిగా జై షా ఎన్నికల్లో గెలిచాడు. సొంతగా నిర్ణయాలు తీసుకోగలడు. అతడి తండ్రి రాజకీయ నాయకుడు. మేం వ్యక్తిగతంగా అతడితో కలిసి పనిచేస్తాం. బీసీసీఐలో రాజకీయ జోక్యానికి తావులేదు. అయితే క్రికెట్‌ పాలనలో నేతల ప్రాబల్యం కనిపిస్తోంది. దివంగత అరుణ్‌ జైట్లీ క్రికెట్‌కు సేవ చేసినప్పటికీ బీసీసీఐలో ఎలాంటి పదవులు చేపట్టలేదు. దిల్లీ క్రికెట్లో మాత్రం కీలకంగా ఉన్నారు. రాష్ట్ర సంఘాలకు ఎన్నికైన పాలనా వ్యవస్థ ఉంది. సంఘాలను నడిపించడం అంత సులభం కాదు. బలమైన వ్యక్తులు అవసరం" అని గంగూలీ అన్నాడు.

ఇవీ చూడండి.. క్రికెట్‌ దక్షిణాఫ్రికా సీఈఓపై వేటు

ABOUT THE AUTHOR

...view details