తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​ పేరు లేకపోవడం ఏంటి: లక్ష్మణ్​

క్రికెట్​లో అత్యుత్తమ అవార్డుగా పరిగణించే విజ్డెన్​ జాబితాలో రోహిత్​ శర్మ పేరు లేకపోవటం ఆశ్చర్యానికి గురిచేసిందని మాజీ క్రికెటర్​ వీవీఎస్​ లక్ష్మణ్​ అన్నాడు. యాషెస్​ సిరీస్​ ముఖ్యమైనదే అయినా.. ప్రపంచకప్​లో అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్​కు ఈ ఘనత దక్కకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశాడు.

By

Published : Apr 12, 2020, 10:55 AM IST

World Cup is bigger than Ashes: VVS Laxman 'shocked' to see Rohit Sharma's name missing from Wisden Leading Crickter 2019 list
జాబితాలో రోహిత్​శర్మ లేకపోవటం ఏంటి: వీవీఎస్​ లక్ష్మణ్​

2019 విజ్డెన్‌ అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు చోటు దక్కకపోవడం షాక్‌కు గురిచేసిందని మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ అంటున్నాడు.

"యాషెస్‌ సిరీస్‌ ముఖ్యమైనదే కావొచ్చు. కానీ ప్రపంచకప్‌ దాని కంటే పెద్దది. అలాంటి టోర్నీలో రోహిత్‌ అయిదు శతకాలు బాదాడు. కఠినమైన సౌతాంప్టన్‌ పిచ్‌పై దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఇతర ఆటగాళ్లు పరుగులు చేయడానికి కష్టపడితే.. అతను మాత్రం అద్భుతంగా ఆడి సెంచరీ చేశాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అలాంటి ఆటగాడిని పరిగణనలోకి తీసుకోకపోవడం అశ్చర్యకరం."

-వీవీఎస్​ లక్ష్మణ్​, టీమ్​ఇండియా మాజీ ఆటగాడు

రోహిత్​ శర్మ

ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ ఎలీస్‌ పెర్రీ 'విజ్డెన్‌ లీడింగ్‌ క్రికెటర్లు'గా నిలిచారు. రసెల్‌ను ఉత్తమ టీ20 క్రికెటర్‌గా.. పెర్రీతో పాటు కమిన్స్‌, లబుషేన్‌, ఆర్చర్‌, సైమన్​ హార్మర్​లను 2019 సంవత్సరానికి అత్యుత్తమ అయిదుగురు క్రికెటర్లుగా విజ్డెన్‌ ప్రకటించింది.

ఇదీ చూడండి.. కరోనా దెబ్బకు టాలీవుడ్ లెక్కలు తారుమారు!​

ABOUT THE AUTHOR

...view details