ప్రపంచకప్ ముగిసి 4 నెలలు అవుతున్నా.. ఇంకా అదే స్థితిలో ఉన్నాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. ఆ టోర్నీ ఫైనల్లో ఓడి, నాటకీయ పరిణామాల మధ్య కప్ చేజార్చుకోవడంపై మరోసారి పెదవి విప్పాడు. బౌండరీ కౌంట్ ద్వారా విజేతను నిర్ణయించడం నిజమైన క్రికెట్ కాదని అన్నాడు విలియమ్సన్.
"ఇలా జరుగతుందని(ప్రపంచకప్ ఫలితంపై) ఎవరూ ఆలోచించి ఉండరని నేను అనుకుంటున్నా. కొన్ని సార్లు ఆలోచిస్తే.. ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారో అనిపిస్తుంది. మరోసారి జరగకూడదని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది సరైన క్రికెట్ కాదు. ఇరుజట్లు అద్భుతంగా ఆడాయి. ఈ ఫలితాన్ని తీసుకోవడం కొంచెం కష్టం"
- కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్.