తెలంగాణ

telangana

ETV Bharat / sports

విజయమే లక్ష్యంగా..! - australia

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్​లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న మెన్ ఇన్ బ్లూ.... రెండో వన్డేలోనూ గెలిచి తీరాలని భావిస్తున్నారు. ఈ సమరానికి నాగ్​పూర్ వేదిక కానుంది.

గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతున్న టీమిండియా

By

Published : Mar 4, 2019, 5:33 PM IST

నాగ్​పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం రెండో వన్డే ఆడనుంది భారత పురుషుల జట్టు. ప్రపంచకప్​కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. మొదటి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది మెన్ ఇన్ బ్లూ.

తుది జట్టులో ఉండేది ఎవరు..?

ఓపెనర్ ధావన్ మొదటి మ్యాచ్​లో డకౌటై నిరుత్సాహ పరిచాడు. ఈ మ్యాచ్​లో అతడికి అవకాశమిస్తారా లేక రాహుల్​కుఅది వరిస్తుందా చూడాలి. రోహిత్ శర్మ తనదైన రోజున చెలరేగడం ఖాయం. కోహ్లి గత మ్యాచ్​లో 44 పరుగులతో ఆకట్టుకున్నాడు. మొదటి మ్యాచ్​లో విఫలమైన రాయుడు మళ్లీ ఫాంలోకి రావాల్సిందే. గత మ్యాచ్​లో విఫలమైన విజయ్ శంకర్ స్థానంలో రిషభ్​ పంత్ ఆడే అవకాశముంది.

హైదరాబాద్​లో 81 పరుగులతో రాణించాడు కేదార్ జాదవ్. బ్యాటింగ్​తోనే కాకుండా బౌలింగ్​తోనూ ఆకట్టుకుంటున్నాడు. 59 పరుగులతో ఆకట్టుకున్నాడు ధోని. అతడి నుంచి మరోసారి అలాంటి ప్రదర్శననే ఆశిస్తున్నారు క్రికెట్ అభిమానులు.

పేసర్లు బుమ్రా, షమి తమ బౌలింగ్​తో ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ని ఇబ్బంది పెడుతున్నారు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రాణిస్తున్నాడు. వికెట్లేమీ తీయకపోయినా తక్కువ పరుగులే ఇచ్చాడు జడేజా. రేపటి వన్డేలో రెండో స్పిన్నర్​గా అతడే ఉండొచ్చు.

ఫించ్ గాడిలో పడేనా..

గత మ్యాచ్​లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా.. విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. కెప్టెన్ ఫించ్ విఫలమవుతుండటం కంగారూ జట్టును ఆలోచనల్లో పడేసింది. మిగతా బ్యాట్స్​మెన్ తమ పరిధి మేరకు రాణిస్తున్నారు.

జంపా ఒక్కడే..

బౌలర్లలో ఆడమ్ జంపా ఒక్కడే భారత బ్యాట్స్​మెన్​ని ఇబ్బంది పెట్టాడు. మిగతా బౌలర్ల నుంచి అతడికి సహకారం అందడం లేదు.

భారత జట్టులో రెండు స్థానాల కోసం నలుగురు పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ సిరీస్ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

జట్లు(అంచనా)

భారత్..

విరాట్ కోహ్లి(కెప్టెన్),రోహిత్ శర్మ, ధావన్, రాయుడు, ధోని(వికెట్ కీపర్), కేదార్ జదావ్, విజయ్ శంకర్, బుమ్రా, షమి, కుల్దీప్ యాదవ్, చాహల్, పంత్, కౌల్, రాహుల్, జడేజా

ఆస్ట్రేలియా...

ఫించ్(కెప్టెన్), షార్ట్, షాన్ మార్ష్, స్టాయినిస్, ఖావాజా, అలెక్స్ క్యారీ, హాండ్స్​కోంబ్, టర్నర్, జంపా, బెహ్రన్​డార్ఫ్, రిచర్డ్​సన్, కమిన్స్, ఆండ్రూ టై, కౌల్టర్​నైల్, లైయన్.

ఇవి కూడా చదవండి:

ABOUT THE AUTHOR

...view details