తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ నిబంధనతో బౌలర్లకు కష్టమే: సచిన్ - భారత్ vs ఆస్ట్రేలియా టెస్టు సిరీస్

క్రికెట్​లో సలైవా నిషేధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్. పరిమిత ఓవర్లతో పోలిస్తే టెస్టుల్లో ఆడే విధానం వేరుగా ఉంటుందని అన్నాడు. అందుకు తగ్గట్లుగానే భారత క్రికెటర్లు ఉండాలని సూచించాడు.

With the saliva ban, bowlers are handicapped: Tendulkar
ఆ నిబంధనతో బౌలర్లు వికలాంగులు అయినట్లే: సచిన్

By

Published : Dec 14, 2020, 3:38 PM IST

లాక్​డౌన్​ తర్వాత క్రికెట్​లో చాలా మార్పులు జరిగాయి. బయో బబుల్​లో ఆడటం, బంతికి ఉమ్మి రుద్దడం నిషేధం లాంటి నిబంధనలు రూపొందించారు. అవి అమల్లోకి రాగానే ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు దిగ్గజ సచిన్​ కూడా దాని గురించే మాట్లాడాడు. భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​ త్వరలో జరగనున్న నేపథ్యంలో మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి.

"సలైవా నిషేధం, దానికి ఇంతవరకు ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల బౌలర్లు వికలాంగులు అవుతున్నారు. క్రికెట్​లో సలైవా, చెమట చాలా ముఖ్యం. అయితే బౌలర్లు చెమటతో పోల్చితే దాదాపు 60 శాతం సలైవాకే ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు దానిపైనే నిషేధం విధించారు. దీంతో బౌలర్లు ఏం చేయలేకపోతున్నారు."

-సచిన్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

టెస్టు సిరీస్​లో ఆస్ట్రేలియా బ్యాటింగ్​ లైనప్​ను పడగొట్టాలంటే భారత బౌలర్లు సలైవాకు ప్రత్యామ్నాయం చూసుకోవాలని తెలిపాడు సచిన్. ఈ ఫార్మాట్​లో ప్రతిరోజూ ఒకేలా ఉండదని చెప్పిన మాస్టర్.. పరిమిత ఓవర్ల సిరీస్​లోని ప్రదర్శనతో టెస్టులను పోల్చిచూడటం సరికాదని అన్నాడు. గతంలో ఏం జరిగిందో వదిలేయాలని, ప్రస్తుతం టెస్టు సిరీస్​పైనే దృష్టి సారించాలని సచిన్ భారత ఆటగాళ్లకు సూచించాడు.

భారత్ -ఆస్ట్రేలియా ఆటగాళ్లు

ఇటీవల జరిగిన గులాబీ బంతి వార్మప్​ మ్యాచ్​లో టీమ్​ఇండియా బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా-ఎ ను 108 పరుగులకే ఆలౌట్ చేసి అబ్బురపరిచారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోరు డ్రాగా ముగిసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details