తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2019, 1:07 PM IST

Updated : Dec 18, 2019, 1:12 PM IST

ETV Bharat / sports

టాస్ గెలిచిన విండీస్.. భారత్ బ్యాటింగ్​

విశాఖ వేదికగా భారత్​తో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్​ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ పిచ్ బ్యాటింగ్​కు అనుకూలించనుంది.

India
విండీస్ - భారత్

భారత్​తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్​ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో నెగ్గి సిరీస్ ఆశలు సజీవం చేసుకోవాలని అనుకుంటోంది కోహ్లీ సేన. ఇందులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఆశపడుతోంది కరీబియన్ జట్టు.

రిషభ్ పంత్

విశాఖ పిచ్ బ్యాట్స్​మెన్​ అనుకూలించనుంది. అదేవిధంగా స్పిన్నర్లకూ సహకరించనుంది. శివమ్ దూబే స్థానంలో శార్దుల్ ఠాకుర్​కు అవకాశం కల్పించారు.

ప్రాక్టీస్ అనంతరం జడేజా
ఈ పిచ్​పై భారత్​కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. తొలి వన్డేలో ఓటమి పాలైన టీమిండియా.. ఈ మ్యాచ్ కోసం నెట్స్​లో తీవ్రంగా ప్రాక్టీస్ చేసింది.

జట్లు..

భారత జట్టు:

రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​, విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), శ్రేయస్​ అయ్యర్​, రిషబ్​ పంత్​(కీపర్​), కేదార్​ జాదవ్​, శార్దుల్ ఠాకుర్, రవీంద్ర జడేజా, దీపక్​ చాహర్​, కుల్దీప్​ యాదవ్​, మహ్మద్​ షమి.

వెస్టిండీస్​ జట్టు:

షై హోప్​, ఎవిన్ లూయిస్​, షిమ్రన్​ హెట్​మెయిర్​, రోస్టన్​ ఛేజ్​, నికోలస్ పూరన్​(కీపర్), కీరన్​ పొలార్డ్​(కెప్టెన్​), జేసన్​ హోల్డర్​, కీమో పాల్​, షెల్డన్​ కాట్రెల్​, పియారే​, అల్జారీ జోసెఫ్.​

ఫుట్​బాల్ ఆడుతున్న విండీస్ క్రికెటర్లు

ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం ముందుకు రానున్న ఆటగాళ్లు వీరే

Last Updated : Dec 18, 2019, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details