భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్‌ను అప్పట్లో ఎలా ఔట్ చెయ్యాలో అర్థంకాక తమజట్టు సతమతమయ్యేదని తెలిపాడు ఇంగ్లాండ్ మాజీ సారథి నాసర్ హుస్సేన్. అతడి వికెట్ తీసేందుకు లెక్కకు మించి జట్టు సమావేశాలు జరిపినట్లు వెల్లడించాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్‌ను ఛేదించాలంటే చాలా కష్టంగా ఉండేదని అన్నాడు. తాజాగా ఐసీసీ నిర్వహించిన 'క్రికెట్ ఇన్సైడ్ అవుట్' అనే కార్యక్రమంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.
" సచిన్ తెందూల్కర్ ఆల్ టైమ్ ఫేవరెట్ బ్యాట్స్‌మెన్. అతడి బ్యాటింగ్ టెక్నిక్ అమోఘం. నేను ఇంగ్లాండ్ జట్టు సారథిగా ఉన్నప్పుడు.. అతడిని కట్టడి చేయాలనే వ్యూహంపై లెక్కకి మించి జట్టు సమావేశాల్ని నిర్వహించేవాడిని. నా కెరీర్‌లో ఎదురైన అత్యంత కఠినమైన బ్యాట్స్‌మెన్స్‌లో సచిన్ ఒకడు. "
-నాసర్ హుస్సేన్, ఇంగ్లాండ్ మాజీ సారథి.