తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్ట్ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ టై అయితే..? - యాషెస్

ప్రపంచకప్​ 2019 ఫైనల్ మ్యాచ్​ టైగా ముగియడం వల్ల బౌండరీ కౌంట్​ ద్వారా విజేతను నిర్ణయించారు. ఇప్పుడు ఆగస్ట్​ 1 నుంచి ప్రారంభమైన టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్ టై అయితే..? అనే ప్రశ్న చర్చనీయాంశమైంది.

టెస్ట్ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ టై అయితే..?

By

Published : Aug 3, 2019, 7:01 AM IST

గురువారం నుంచేప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​​ అధికారికంగా ప్రారంభమైంది. ఇంగ్లాండ్​ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్​తో ఈ దీర్ఘకాల టోర్నీ మొదలైంది. ఇటీవలే ముగిసిన వరల్డ్​కప్​ టై అవడం వల్ల బౌండరీ కౌంట్ ద్వారా విజేతను నిర్ణయించారు. మరి టెస్ట్ ఛాంపియన్​షిప్​​ ఫైనల్​ మ్యాచ్​ టైగా ముగిస్తే విజేతగా ఎవరు నిలుస్తారన్నది అందరిని తొలుస్తున్న ప్రశ్న.

ఐసీసీ టెస్ట్​ ర్యాంకింగ్స్​లో టాప్​-9లో ఉన్న జట్లు ఈ ఛాంపియన్​షిప్​లో పాల్గొననున్నాయి. 2021 మార్చి 31 వరకు 27 టెస్టు సిరీస్​లు ఆడనున్నాయి. పాయింట్ల ఆధారం టాప్ రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్​కు చేరతాయి. ఈ సిరీస్​లో ఒక్కో జట్టు స్వదేశంలో 3, విదేశాల్లో 3 సిరీస్​లు ఆడుతుంది.

టెస్టు ఛాంపియన్​షిప్​ గద

పాయింట్ల కేటాయింపు ఇలా..

ఒక్కో సిరీస్​కు గరిష్ఠంగా 120 పాయింట్లు ఉంటాయి. ఈ పాయింట్లను ఆడే మ్యాచ్​ల సంఖ్య ఆధారంగా విభజిస్తారు. ఉదాహరణకు ఒక్క సిరీస్​లో రెండు టెస్టులుంటే.. ఒక్కో మ్యాచ్​కు 60 పాయింట్లు కేటాయిస్తారు. గెలిచిన జట్టు మొత్తం పాయింట్లు సొంతం చేసుకుంటుంది. టై అయితే ఇరు జట్లకు చెరో సగం పాయింట్లు(30, 30) లభిస్తాయి. మ్యాచ్​ డ్రాగా ముగిస్తే(రెండు జట్ల స్కోరు సమమైతే) 3:1 నిష్పత్తిలో పాయింట్లు కేటాయిస్తారు. ఓడితే ఎలాంటి పాయింట్లు రావు.

ఫైనల్​ మ్యాచ్​ టై అయితే..

పాయింట్ల ఆధారంగా టాప్ రెండు జట్లు తుదిపోరుకు అర్హత సాధిస్తాయి. ఫైనల్​ మ్యాచ్​ టై అయితే ఇరు జట్లను ఉమ్మడి ఛాంపియన్లుగా ప్రకటిస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక మ్యాచ్ నిర్వహించడం కుదరకపోతే రిజర్వ్​ డే ఉంటుంది. ఐదు రోజుల్లో కనీసం ఆడాల్సిన సమయంలో మ్యాచ్ ఆడటం కుదరకపోతే అప్పుడు రిజర్వే డేకు అవకాశముంటుంది.

కనీసం ఆడాల్సిన సమయం రోజుకు ఆరు గంటలు చొప్పున ఐదు రోజుల్లో 30 గంటలు ఉంటుంది. ఉదాహరణకు వర్షం కురిసి ఓ రోజు ఆడటం కుదరకపోతే.. మిగిలిన రోజుల్లో అదనపు గంటలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. ఉదాహరణకు నాలుగు రోజుల్లో మూడు గంటలు మాత్రమే అదనంగా ఆడితే.. మిగిలిన మూడు గంటలను రిజర్వ్​ డేకు కొనసాగిస్తారు.

టెస్ట్ ఛాంపియన్​షిప్స్​లో ఒక్కో జట్టు ఇంట, బయట కలిపి ఆరు సిరీస్​లు ఆడుతుంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ ఛాంపియన్​షిప్​ కొనసాగనుంది.

ఇది చదవండి: టెస్టు​ ఛాంపియన్​షిప్:2 ఏళ్లు సాగే క్రికెట్​ యాత్ర

ABOUT THE AUTHOR

...view details