తెలంగాణ

telangana

ETV Bharat / sports

జనవరి నుంచి ఆ దేశ క్రికెటర్లకు జీతాల్లేవ్

బోర్డులోని ఆర్థిక సంక్షోభం వల్ల జనవరి నుంచి విండీస్ క్రికెటర్లకు జీతాలు చెల్లించడం లేదు. వీలైనంత త్వరగా వారికి వేతనాలు ఇస్తామని అన్నారు వెయిన్ లూయిస్.

జనవరి నుంచి ఆ దేశ క్రికెటర్లకు జీతాల్లేవ్
వెస్టిండీస్ క్రికెటర్లు

By

Published : Apr 24, 2020, 8:20 AM IST

వెస్టిండీస్ క్రికెటర్లకు ఈ ఏడాది జనవరి నుంచి జీతాలు అందట్లేదు. క్రికెట్ బోర్డులో ఏర్పడిన ఆర్థిక సంక్షోభమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఐర్లాండ్ సిరీస్, ఫిబ్రవరి-మార్చిలోని శ్రీలంక పర్యటనకు సంబంధించిన మ్యాచ్​ల ఫీజును పురుష క్రికెటర్లకు ఇంకా చెల్లించలేదు. క్రికెట్ వెస్టిండీస్ కూడా ఈ విషయాన్ని అంగీకరించింది.

వెస్టిండీస్ మ్యాచ్​లోని ఓ దృశ్యం

"బోర్డు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రతి ఆటగాడి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా వేతనాలు చెల్లిస్తాం. శ్రీలంక, బంగ్లాదేశ్​ సిరీస్​ల సమయంలో మాకు భారీ నష్టమొచ్చింది. ప్రసారకర్తలు రెండు గంటల ప్రసారానికి ఒక మిలియన్ డాలర్లు మాత్రమే చెల్లించారు" -వెయిన్ లూయిస్, వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్ సెక్రటరీ

అయితే ఆటగాళ్లకు త్వరలో పూర్తి జీతాలు చెల్లిస్తామని క్రికెట్ వెస్టిండీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి జానీ గ్రేవ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details