మొతేరా పిచ్‌పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ స్పందించాడు. స్పిన్ పిచ్‌పై ఫిర్యాదులు చేస్తున్న ఇంగ్లాండ్ జట్టును విమర్శించాడు. నాలుగో టెస్టులోనూ ఈ తరహా పిచ్‌ను తయారు చేయాలని అభిప్రాయపడ్డాడు.
"ఇటీవల భారత్‌లో జరిగిన టెస్టుల గురించి నన్ను కొందరు కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటిపై నాకు కొంత గందరగోళం ఏర్పడింది. అక్కడి పిచ్‌ల గురించి చాలా మాటలు వినపడుతున్నాయి. ఇకనైనా వీటిని ఆపండి. ఇంగ్లాండ్ జట్టు వెళ్లిందే స్పిన్ పిచ్‌లు ఉండే దేశానికి. ఆ విధంగానే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా తయారు కావాల్సింది మీ బ్యాట్స్‌మెన్. మీరు సరిగా ఆడకుండా వికెట్‌ను నిందించడం సరికాదు"
-వివియన్ రిచర్డ్స్, విండీస్ మాజీ క్రికెటర్
ఇప్పుడు ఇంగ్లాండ్ టీమ్‌కు స్పిన్ గురించి ఒక అవగాహన రావొచ్చని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. తర్వాతి మ్యాచ్‌లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఈ అనుభవం మీకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. తదుపరి టెస్టులోనూ ఇదే తరహా వికెట్ ఉంటుందని అంచనా వేశాడు. ఆ స్థానంలో నేనున్నా.. స్పిన్ పిచ్‌నే తయారు చేస్తానని వివియన్ స్పష్టం చేశాడు.