తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వన్డేల్లో కోహ్లీ సెంచరీలు 75 నుంచి 80' - కోహ్లీ రిటైర్మెంట్​

వెస్టిండీస్​తో రెండో వన్డేలో శతకంతో ఆకట్టుకున్న కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు భారత క్రికెటర్​ వసీం జాఫర్​.  విరాట్​  రిటైర్మెంట్​ ప్రకటించేసరికి అందరి శతకాల రికార్డులు బ్రేక్​ అయిపోతాయని అభిప్రాయపడ్డాడు. 75 నుంచి 80 వన్డే సెంచరీలు కచ్చితంగా కోహ్లీ ఖాతాలో చేరతాయని ధీమా వ్యక్తం చేశాడు జాఫర్​.

'కోహ్లీ రిటైర్మెంట్ నాటికి ఎన్ని శతకాలు చేస్తాడో తెలుసా..!'

By

Published : Aug 13, 2019, 6:39 AM IST

Updated : Sep 26, 2019, 8:08 PM IST

ప్రపంచకప్​లో వరుసగా 5 అర్ధశతకాలతో రాణించిన విరాట్​ కోహ్లీ... దాదాపు 11 ఇన్నింగ్స్​ల​ తర్వాత మళ్లీ సెంచరీతో జోష్​ చూపించాడు. ప్రస్తుతం విండీస్​తో మూడు వన్డేల సిరీస్​లో ఉన్న కోహ్లీ... తాజాగా శతకంతో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శన తర్వాత కోహ్లీపై భారత క్రికెటర్​ వసీం జాఫర్​ ప్రశంసలు కురిపించాడు.

కోహ్లీ, వసీం జాఫర్​

" 11 ఇన్నింగ్స్​ల తరవాత మళ్లీ సాధారణ సేవలు ప్రారంభమయ్యాయి. నా అంచనా ప్రకారం వన్డేల్లో

కోహ్లీ 75 నుంచి 80 శతకాలు సాధిస్తాడు. "

-- వసీం​ జాఫర్​, క్రికెటర్​

ట్రినిడాడ్​ వేదికగా జరిగిన రెండో వన్డేలో 125 బంతులాడిన కోహ్లీ 120 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, 1 సిక్సర్​ ఉన్నాయి. ఇది విరాట్​ కెరీర్​లో 42వ శతకం. ఈ ఫార్మాట్​లో భారత దిగ్గజ ఆటగాడు సచిన్​ 49 శతకాలతో కోహ్లీకన్నా ముందున్నాడు.

ఇప్పటికే గంగూలీ చేసిన అత్యధిక వన్డే పరుగుల రికార్డు సహా పాకిస్థాన్​ దిగ్గజ ఆటగాడు జావేద్​ మియాందాద్​ విండీస్​పై చేసిన పరుగుల రికార్డును బ్రేక్​ చేశాడు కోహ్లీ.

Last Updated : Sep 26, 2019, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details