తెలంగాణ

telangana

ETV Bharat / sports

అజహర్​ మళ్లీ ఫామ్​లోకి వస్తాడు: వకార్​ యూనిస్​ - cricket england news

సౌథాంప్టన్​ వేదికగా ఇంగ్లాండ్​-పాకిస్థాన్​ మధ్య రెండో టెస్టు ఇవాళ ప్రారంభమైంది. అయితే ఫామ్ లేమితో​ సమస్యలు ఎదుర్కొంటున్న పాక్​ కెప్టెన్​ అజహర్​ అలీకి మద్దతుగా నిలిచాడు మాజీ క్రికెటర్​, బౌలింగ్​ కోచ్​ వకార్​ యూనిస్​. కచ్చితంగా మిగతా రెండు టెస్టుల్లో రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటికే మూడు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది ఇంగ్లీష్​ జట్టు.

Azhar Ali
కెప్టెన్​ అజహర్​ మళ్లీ ఫామ్​లోకి వస్తాడు: వకార్​ యూనిస్​

By

Published : Aug 13, 2020, 4:01 PM IST

ఫామ్​ లేక ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్​ కెప్టెన్​ అజహర్​ అలీకి మద్దతుగా నిలిచాడు ఆ జట్టు ఫాస్ట్​ బౌలింగ్​ కోచ్​ వకార్​ యూనిస్​. తొలి టెస్టు పోరాడి ఓడినప్పటికీ.. మిగిలిన రెండు టెస్టుల్లో జట్టు సత్తా చాటుతుందని పేర్కొన్నాడు. అజహర్​ తన మునుపటి ప్రదర్శన చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు వకార్.​

పాక్​ కెప్టెన్​ అజహర్​ అలీ

"కెప్టెన్​గా ఉండి జట్టు టాప్​ ఆర్డర్​లో ఆడటం అంత సులభమేం కాదు. గతంలోనూ అజహర్​ కెప్టెన్​గా ఉన్నాడు. అతడికి ఇలాంటి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో తెలుసు. మంచి ఫామ్​లో లేనప్పుడు అన్నీ సమస్యలుగానే కనిపిస్తాయి. నీ మీద చాలా భారం ఉన్నప్పటికీ వాటన్నింటిని దాటి నువ్వు బ్యాటింగ్​పై దృష్టి పెట్టాలి. తొలి టెస్టు గెలిచి ఉంటే అతడికి, జట్టుకు మరింత పట్టుదల, ఉత్సాహం వచ్చేది. 80 టెస్టులు ఆడిన అజహర్​ గతంలో ఇంగ్లాండ్​పై మంచి ప్రదర్శనలు చేశాడు. కచ్చితంగా చివరి రెండు టెస్టుల్లో తన సమస్యలను అధిగమించి అత్యుత్తమంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను"

-- వకార్​ యూనిస్​, పాక్ ఫాస్ట్​​ బౌలింగ్​ కోచ్​

మూడు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి టెస్టును మూడు వికెట్ల తేడాతో నెగ్గింది ఇంగ్లాండ్. మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్​ల్లో అలీ.. 0, 18 రన్స్​ మాత్రమే చేశాడు. రెండో టెస్టు సౌథాంప్టన్​ వేదికగా నేటి(ఆగస్టు 13) నుంచి ప్రారంభమైంది.

అజహర్​ అలీ

ABOUT THE AUTHOR

...view details