1983 వరల్డ్‌కప్ ఆధారంగా తెరకెక్కుతున్న '83' చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ పాత్రలో రణ్‌వీర్‌సింగ్ కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమా కోసం కసరత్తులు ప్రారంభించాడు రణ్వీర్. కపిల్‌లా కనిపించడానికి బ్యాటింగ్, బౌలింగ్‌లలో శిక్షణ తీసుకుంటున్నాడు ఈ బాజీరావ్.
"నేను కపిల్ సార్లా కనిపించడానికి ఆయనతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. ఆయన ఆలోచనలు, భావోద్వేగాలను అనుకరిస్తూ నన్ను నేను మార్చుకుంటున్నా. ఆయన పాత్ర చేయడానికి ఎంతో ఆత్రుతతో ఉన్నాను. బౌలింగ్, బ్యాటింగ్‌కు సంబంధించిన చిట్కాలు నేర్చుకోవాలనుకుంటున్నా" అని చెప్పాడు రణ్వీర్ సింగ్.