తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరాట్ ఏం పుస్తకం చదువుతున్నాడో తెలుసా..!

వెస్టిండీస్​ - భారత్​ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ కోహ్లీ 'డిటాక్స్ యువర్ ఈగో' అనే పుస్తకాన్ని చదువుతూ కనిపించాడు. దీనిపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

By

Published : Aug 24, 2019, 5:15 PM IST

Updated : Sep 28, 2019, 3:15 AM IST

విరాట్

ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్ - భారత్ మధ్య టెస్టు మ్యాచ్​ సాగుతోంది. తొలి ఇన్నింగ్స్​లో టీమిండియా బ్యాట్స్​మెన్ వరుసగా పెవిలియన్​ బాట పడుతుండగా.. అభిమానులు కొంచెం అసంతృప్తితో ఉన్న సమయమది. అప్పుడు ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ వైపు గమనిస్తే కోహ్లీ నిశితంగా ఓ పుస్తకం చదువుతుంటాడు. స్టీవెన్ సిల్వస్టర్ రాసిన 'డిటాక్స్ యువర్ ఈగో' పుస్తకాన్ని చదువుతున్న విరాట్​పై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

"విరాట్ తనకు సరిపోయే పుస్తకాన్నే ఎంచుకున్నాడు" అని ఒకరు ట్వీట్ చేయగా.. "మంచిగా ఉంది చాలు.. మేము దూకుడైన కోహ్లీని చూడాలనుకుంటున్నాం" అని మరొకరు పోస్ట్ చేశారు.

"విరాట్ ఆ పుస్తకాన్ని చదువుతున్నాడంటే భారత్ నుంచి కొన్ని వందల పుస్తకాలకు ఆర్డర్లు వస్తాయి" అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.

విండీస్​తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 297 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కరీబియన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఇషాంత్ శర్మ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్​లో 9 పరుగులు చేసిన కోహ్లీ నిరాశ పరిచాడు.

ఇదీ చదవండి: జైట్లీకి నివాళి.. నల్ల బ్యాడ్జీలతో భారత ఆటగాళ్లు

Last Updated : Sep 28, 2019, 3:15 AM IST

ABOUT THE AUTHOR

...view details